మ్యాక్స్‌వెల్ పెళ్లిచేసుకోబోయే భారత యువతి ఎవరో తెలుసా? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!

మ్యాక్స్‌వెల్ పెళ్లిచేసుకోబోయే భారత యువతి ఎవరో తెలుసా? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!

by Sainath Gopi

Ads

మాక్స్ వెల్ అనగానే మనకు గుర్తొచ్చేది సిక్సులు ఫోర్లు…ఫార్మ్ లో ఉన్నాడంటే బాల్ బౌండరీ దాటాల్సిందే. ఇప్పుడు ఆ ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వధువు ఎవరో కాదండోయి…మన భారత అమ్మాయే. ఐపీఎల్ నుంచి ఇండియాతో అనుబంధం ఉన్న అతడు. భారత సంతతి మహిళనే పెళ్లి చేసుకోనున్నాడు. మెల్‌ బోర్న్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌(ఫార్మాసిస్ట్‌)ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయితోనే ఇటీవల తనకు ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాక్స్‌ వెల్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు.

Video Advertisement

గత కొన్ని రోజులుగా ఫారిన్ టూర్స్, డిన్నర్‌లకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు ఈ జంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి కానున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారు. ఈ జోడీ ఫొటో తొలిసారి 2017లో మీడియా దృష్టిలో పడింది. 2019 ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో తన భాగస్వామి రామన్‌తో కలిసి మాక్స్‌వెల్‌ రావడంతో పెళ్లి గురించి చర్చ మొదలైంది. తాజాగా మాక్సీ-వినీ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో ఆసీస్‌ క్రికెటర్లు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు.

ఇప్పుడు మాక్స్ వెల్ పెళ్లి చేసుకోబోయే ఆమె విషయానికి వస్తే…మెల్‌బోర్న్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ అనేక సందర్భాల్లో మీడియా కెమెరాలకు చిక్కారు. ఓ దశలో విరామం లేని క్రికెట్ కారణంగా మ్యాక్స్ వెల్ మానసిక ఒత్తిడి గురయ్యాడు.ఆ సమయంలో ఆమె తోడుగా ఉంది ప్రోత్సహించింది అంట. దాంతో వారిద్దరి బంధం మరింత పెరిగింది అంట.


End of Article

You may also like