Ads
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు.
Video Advertisement
అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీ రామ చంద్రుడి పాత్ర లో మెరుపులు మెరిపించారు. టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.
కథల ఎంపిక లో పర్ఫెక్ట్ గా ఉండే ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుంచి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ ఉన్నారు. కథలు, పాత్రల విషయం లో చాలా జాగ్రత పడతారుట ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
ఎన్టీఆర్ భీమ్ పాత్ర అందరికీ నచ్చేసింది. అలానే చరణ్, ఎన్టీఆర్ కోర్డినేషన్ కూడా ఎంతో బాగుంది. ఓవర్ ఆల్ గా సినిమా అదిరి పోయింది. అయితే జపాన్ లో RRR సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. అయితే అక్కడ ఎన్టీఆర్ జాపనీస్ లో మాట్లాడారు. దాని అర్ధం ఏమిటో తెలుసా..? “హలో ఎవరీ వన్, అందరూ ఎలా ఉన్నారు..?, మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. సినిమాని ఎంజాయ్ చేయండి. థాంక్యూ” అని జాపనీస్ లో ఎన్టీఆర్ మాట్లాడారు.
watch video :
End of Article