“మహేష్” సినిమాల్లో ఈమె చాలా స్పెషల్…sentiment ఆ లేక coincidence ఆ.?

“మహేష్” సినిమాల్లో ఈమె చాలా స్పెషల్…sentiment ఆ లేక coincidence ఆ.?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఎవరు అవి సెంటిమెంట్ అని బయటికి చెప్పరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకే అర్థమైపోతాయి. కొంతమంది చాలాసార్లు కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు. వాళ్లని చూస్తే బహుశా సెంటిమెంట్ ఏమైనా ఫాలో అవుతున్నారు ఏమో అనుకుంటాం.

Video Advertisement

కానీ నిజానికి అందరూ సెంటిమెంట్స్ ఫాలో అవ్వరు. కొంతమంది కోఇన్సిడెన్స్ ద్వారా కూడా రిపీట్ అవుతారు. అలా కోఇన్సిడెన్స్ వల్ల కానీ, లేదా నిజంగా సెంటిమెంట్ వల్ల కానీ మీనాక్షి దీక్షిత్ కూడా మహేష్ బాబు తో ఒకటి కంటే ఎక్కువ సార్లు పని చేశారు.

హిందీలో నచ్లే వే విత్ సరోజ్ ఖాన్ ప్రోగ్రాం ద్వారా కెరియర్ ని మొదలుపెట్టారు మీనాక్షి దీక్షిత్. తర్వాత లైఫ్ స్టైల్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తర్వాత మలయాళంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనే సినిమా చేశారు. దూకుడు సినిమాలో టైటిల్ సాంగ్ లో కనిపిస్తారు మీనాక్షి దీక్షిత్.

బాడీగార్డ్, బాద్షా సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించారు మీనాక్షి దీక్షిత్. ఇంకా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించారు. 2011లో వచ్చిన దూకుడు తర్వాత 2018 లో వచ్చిన  “భారత్ అనే నేను” లో కూడా నటించారు.  2019 లో వచ్చిన మహర్షి మహేష్ బాబు తో కలిసి నటించారు మీనాక్షి దీక్షిత్.

వరస ఫ్లాప్ ల తర్వాత మహేష్ బాబు హిట్ అందుకుంది “దూకుడు” చిత్రం తోనే. అలా దూకుడులో ఆమెకు ఛాన్స్ ఇవ్వడంతో సెంటిమెంట్ గా మారింది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అలాగే భారత్ అనే నేను సినిమాకి ముందు కూడా మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయ్యింది.


End of Article

You may also like