Ads
నన్ను కొంతమంది బెదిరిస్తున్నారని అలాగే నాపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మీరా చోప్రా చెప్తూ అందుకు సంబందించిన స్క్రీన్ షాట్స్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరియు కవిత లకు ట్వీట్ చేసారు.అయితే దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..ఈ విషయాన్ని తెలంగాణ డిజిపి మరియు హైదరాబాద్ పోలీస్ ల ద్రుష్టి కి తీసుకువెళ్లి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోమని చెప్తాను అని అన్నారు.అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ నుండి రిప్లై రావడంతో మీరా చోప్రా ఆనందం వ్యక్తం చేసారు.మహిళల రక్షణకు ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని మీరా చోప్రా అన్నారు.
Video Advertisement
అసలు మీరా చోప్రా పై సోషల్ మీడియాలో కొంతమంది విరుచుకుపడడానికి కారణం ఏమిటి?ఆ వివాదం ఎలా మొదలైంది అంటే …జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని ఓ నెటిజన్ మీరా చోప్రా ను ప్రశ్నించాడు.నాకు ఎన్టీఆర్ గురించి ఏమి తెలియదు ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు అని మీరా చోప్రా రిప్లై ఇచ్చారు.
దీంతో కొంతమంది మీరా చోప్రా ను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా దూషించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతమంది నెటిజెన్స్ మరియు మీరా చోప్రా మధ్య వివాదం మరింత ముదిరింది.
End of Article