Ads
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ ఒకటో తారీఖున జరిగినా విషయం తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ నందు వీరి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. మెగా ఇంటి ఫంక్షన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కళ్ళు జిగేలుమనేలా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక జరిగింది.
Video Advertisement
రిసెప్షన్ లో లావణ్య అచ్చం తెలుగింటి అమ్మాయిల చీరకట్టుతో కనిపించింది. వరుణ్ తేజ్ కూడా మంచి సూటుతో అందంగా మెరిశాడు. అయితే రిసెప్షన్ లో లావణ్య చేసిన పనికి మెగా అభిమానులందరూ ఫిదా అయిపోతున్నారు.
రిసెప్షన్ లో చిరంజీవి వచ్చి వరుణ్ణి లావణ్యను ఆశీర్వదించారు. వెంటనే లావణ్య అతనికి పెద్ద మామయ్య వరుసైన మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అక్కడున్న వారంతా ఇది చూసి లావణ్య సంస్కారానికి ముచ్చట పడుతున్నారు. తర్వాత నట గురువు సత్యానంద్ కాళ్లు మొక్కింది. ఈయన టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలకు నటనలో మెలకువలు నేర్పించారు వరుణ్ తేజ్ కూడా ఈయన దగ్గరే నటనలో శిక్షణ తీసుకున్నారు. అటువంటి గురువు రాగానే లావణ్య ఏ మాత్రం సంకోచించకుండా ఆయన పాదాలకు నమస్కరించింది.
ఆమె వినయం విధేయతా చూసిన మెగా అభిమానులు తెలుగింటి కోడలిగా లావణ్య నూటికి నూరు శాతం మార్కులు కొట్టేసిందని బంగారమని కొనియాడుతున్నారు.మెగా ఫ్యామిలీ అంటేనే సంస్కారానికి పెట్టింది పేరని అలాంటి ఫ్యామిలీలోకి కోడలుగా వెళుతున్న లావణ్య ఆ సంస్కారాన్ని అందుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెబుతున్నారు.ఈ రిసెప్షన్ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది సాయి ధరంతేజ్ అల్లు కుటుంబం రామ్ చరణ్ అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు అందరూ ఈ కపుల్ కి విషెస్ తెలియజేశారు.
Also Read:వరుణ్ తేజ్-లావణ్యలకు కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చిన చిరంజీవి – పవన్ కళ్యాణ్…ఏంటంటే.?
End of Article