Ads
ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి 65వ జన్మదినం జరుపుకున్నారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 100 మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి అభిమానులు రూపొందించిన మెగాస్టార్ బర్త్ డే కామన్ డిస్ప్లే మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.
Video Advertisement
సినీ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా, రాజకీయ రంగం నుండి, క్రీడా రంగం నుండి, ఇంకా ఇతర రంగాల నుండి ఎంతో మంది ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు ట్విట్టర్ లో #హెచ్ బి డి మెగాస్టార్ చిరంజీవి (#HBDMegastarChiranjeevi) అనే హాష్ ట్యాగ్ తో బర్త్ డే ట్రెండ్ చేశారు.
ఆగస్టు 21 సాయంత్రం నుండి మెగాస్టార్ అభిమానులు ఈ హాష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. ఒక్క రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 2.62 మిలియన్ ట్వీట్లు చేశారు. దాంతో సీనియర్ హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ లో ఈ ట్రెండ్ హైయెస్ట్ గా నిలిచింది.
అంతకుముందు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు ఒక్క రోజులో దాదాపు 1. 75 మిలియన్ ట్వీట్లు చేశారు. అప్పుడు ఈ ట్రెండ్ సీనియర్ హీరోల బర్త్ డే ట్రెండ్ లో టాప్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మెగా స్టార్ బర్త్ డే ట్రెండ్ బాలకృష్ణ బర్త్ డే ట్రెండ్ టార్గెట్ ని బ్రేక్ చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు ట్రెండ్ కి 24 గంటల్లో దాదాపు 1. 75 మిలియన్ ట్వీట్లు వస్తే…1.75 మిలియన్ ట్వీట్లు చిరంజీవి బర్త్డే ట్రెండ్ కి 15 గంటల్లోనే వచ్చేసాయి.
End of Article