అప్పుడు అవమానించారు…ఇప్పుడు అక్కడే నిరూపించుకున్నారు.! 15 ఏళ్ళ తర్వాత ఇలా.? అదీ మెగాస్టార్ రేంజ్!!

అప్పుడు అవమానించారు…ఇప్పుడు అక్కడే నిరూపించుకున్నారు.! 15 ఏళ్ళ తర్వాత ఇలా.? అదీ మెగాస్టార్ రేంజ్!!

by kavitha

Ads

53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగబోతుంది. ఈ ఫెస్టివల్లో మన తెలుగు సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈక్రమంలో తెలుగు సినీ ప్రేక్షకులు పదిహేను సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి మాటలను గుర్తుచేసుకుంటున్నారు.

Video Advertisement

వజ్రోత్సవాల్లో మెగాస్టార్ మాట్లాడుతూ అప్పటి ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమాకి, మన తెలుగు మహానటులకి గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. కానీ ప్రస్తుతం అవమానించిన వారి అభిమానం పొందడమే కాకుండా, అరుదైన గౌరవాన్ని పొందుకుని తెలుగు వారు గర్వపడేలా చేశారు మన మెగాస్టార్.

chiranjeevi old video in vajrotsavam about film industry

పెద్దవాళ్ళు ఉరికే అనలేదు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని, అలానే ఎక్కడ అవమానం పొందామో, తిరిగి అక్కడే గౌరవం పొందడం చాలా గొప్ప విషయం కూడా. ఈ ఏడాది ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు పరిశ్రమ సత్తాని ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఎన్ ఎన్ టి ఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, బాలయ్య ‘అఖండ’ సినిమాలను ప్రదర్శించనున్నారు.

ఇవే కాకుండా ఓటీటీలో విడుదలైన ‘ఖుదీరామ్ బోస్’, ‘సినిమా బండి’ సినిమాలను కూడా చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అడివి శేష్ తెలుగులో నటించిన ‘మేజర్’ మూవీ హిందీ వెర్షన్ కూడా ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటితో పాటుగా తెలుగు నిర్మాత అయిన స్రవంతి రవి కిశోర్ నిర్మించిన తమిళంలో తొలి సినిమా ‘కీడా’ ఎంపికైంది.

ఇదే కాకుండా టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో వచ్చిన హిందీ సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఇండియన్ పనోరమాకు కీడా’ఎంపికైంది. ఇండియన్ రీస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ఐదు సినిమాలను ప్రదర్శించనున్నారు. అయితే ఐదు చిత్రాల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం’ ఉండడం విశేషం.అలాగే ఇటీవల మరణించిన తెలుగు లెజెండరీ నటులు కృష్ణంరాజు, కృష్ణలకు నివాళిగా వారు నటించిన సినిమాలను ప్రదర్శించబోతున్నారు.

అంతేకాకుండా ఈసారి ఇండియన్ పనోరమా చిత్రాలను ఎంపిక చేసే కమిటీలో తెలుగు దర్శకులైన వి.ఎన్.ఆదిత్య, ప్రేమ్ రాజ్ చోటు దక్కడం విశేషం. వీటికి ముఖ్య కారణం ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత జాబితాలో ఉన్నవారు ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క,రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్. వజ్రోత్సవాల్లో చిరంజీవి ఆరోజు ఏ గుర్తింపు అయితే తెలుగువారికి లేదని బాధపడ్డారో, ఈ రోజు అదే గుర్తింపు మన తెలుగు సినిమాకి గోవాలో జరుగబోతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్కింది.

ఆనాడు ఎవరి ఫోటోలు లేవని ఆవేదన చెందారో, ఆ హీరోల చిత్రాలను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే పరిస్థితి రానే వచ్చింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ గా ఎంపిక చేయడం తెలుగు సినిమాకి గర్వకారణం అని చెప్పాలి. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగనుంది. ఈ తరుణంలో పదిహేను ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి వజ్రోత్సవాల్లో ఇచ్చిన స్పీచ్ సంభందించిన  వీడియోను వైరల్ చేస్తున్నారు అభిమానులు.

watch video :


End of Article

You may also like