Ads
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాలు చేయడం పై దృష్టి పెట్టారు.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడిగా కాజల్ నటిస్తుంది.చరణ్ పక్కన జోడిగా నటించేది ఎవరో ఇంకా ఫైనల్ అవ్వలేదు.
Video Advertisement
ఈ చిత్రం అనంతరం మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో నటించాల్సి ఉంది.ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం లూసిఫర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.ఆచార్య చిత్రం పూర్తవ్వగానే ఇందులో మెగాస్టార్ నటించాల్సి ఉంది.ఇక కరోనా నేపథ్యంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి.దానితో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.
ప్రభుత్వాలు షూటింగ్ లు చేసుకోమని పర్మిషన్ లు ఇచ్చిన పెద్ద సినిమాలన్నీ షూటింగ్ లకు వెళ్లే ధైర్యం చేయలేదు.తాజా పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాల టీమ్స్ అన్ని ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో అని అందరూ అటు వైపు ఆసక్తిగా చూస్తున్నారు.ఇలాంటి టైంలో చిరంజీవి క్లీన్ షేవ్ చేసుకున్న ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.దానితో ఇది చిరంజీవి ఆచార్య లుక్ అంటూ ఒక వర్గం ప్రచారం చేయడం మొదలుపెట్టారు.కొద్ది సమయంలోనే ఈ రూమర్ చాలా వేగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించింది.దానితో అభిమానులు కూడా దీన్ని నిజమని నమ్మేశారు.
ఇక దీనికి క్లారిటీ ఇవ్వడం కోసం స్వయంగా చిరంజీవి గారు ముందుకొచ్చారు.ఇంట్లో ఉంటున్నాని క్యాజువల్ గా క్లీన్ షేవ్ చేశానని చెప్పారు.దానితో మొన్నటి దాకా గెడ్డం పెంచుకున్న చిరంజీవి ఇప్పుడు క్లీన్ షేవ్ చేయడంతో అట్లీస్ట్ ఒక మూడు నెలలు ఈ చిత్రం షూట్ స్టార్ట్ కాదంటూ ప్రచారం జరుగుతుంది.
End of Article