Ads
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అత్యవసర సందర్భాలలో మినహాయించి మిగిలిన ఏ ఇతర సమయాల్లో ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో మద్యానికి అలవాటైన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మందుబాబులు మద్యం లభించడం లేదని పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
Video Advertisement
కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు మద్యం అమ్మకాల అంశంపై ఆలోచిస్తున్నట్లు పలు మీడియా చానెల్స్ లో చెప్పారు. ఈ పరిస్ధితుల్లో ఏప్రిల్ 14వతేదీ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు అంట. దీనిపై కర్ణాటక సీఎం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
ఇది ఇలా ఉంటే..మేఘాలయా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి శుక్రవారం(ఏప్రిల్-17,2020) రాష్ట్రంలో మద్యం షాపులు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆరు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాకపోతే షరతులు ఏంటి అంటే…కస్టమర్లు షాపుల వద్ద దాదాపు 1మీటర్ వరకు సోషల్ డిస్టెన్సింగ్ తప్పక పాటించాలి.
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం లేదా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడంపై నిషేధం ఉంటుందన్న ప్రభుత్వం కేవలం ఇంటికి ఒక్కరినే వైన్ షాపు దగ్గరకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.అంతేకాదు షాప్ లో సిబ్బంది తక్కువగా ఉండాలని…డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు హ్యాండ్ శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అయితే మేఘాలయ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా రద్దీ ఎక్కువగా లేకుండా చేసేందేకు తమ దగ్గరకు వచ్చిన కస్టమర్లకు సంబంధిత వైన్ షాపు సిబ్బంది అదే ఏరియాలోని లేదా గ్రామంలోని మరో వైన్ షాపుకు పంపిచవచ్చని తెలిపింది.
End of Article