Ads
కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.. చిన్నవయసులో చిరంజీవి మరణించడంతో అందరూ ఎక్కువగా బాధపడింది అతడి భార్య మేఘన గురించే..పదేళ్ల స్నేహం,ప్రేమని పదిలం చేసుకుంటూ రెండేళ్ల క్రితమే వారు పెళ్లి చేసుకున్నారు..మరి కొన్ని రోజుల్లో చిరు తండ్రి అవుతారనగా హఠాత్తుగా దూరం అయ్యారు. జూన్ 7 న ఆయన మరణించారు. తాజాగా మేఘన సీమంతం వేడుక జరిగింది. భర్త ఫోటోను పెట్టి సీమంతం వేడుక జరిపిన ఫోటోలు నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే మరింత కన్నీళ్లు వస్తున్నాయి.
Video Advertisement

image credits: classy captures

image credits: classy captures

image credits: classy captures
గతంలో దూరం అయిన భర్తని తలచుకుంటూ మేఘన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరిని కంటతడిపెట్టిస్తుంది..
చిరుని ఉద్దేశిస్తూ.. “చిరు,నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుంది..కానీ ఎంత ప్రయత్నించినా మాటల్లో వర్ణించలేకపోతున్నాను.. నువ్వు నాకు ఎంత ముఖ్యం అన్నది చెప్పలేను..నువ్వే నా ఫ్రెండ్,లవర్, లైఫ్ పార్టనర్..నా స్ట్రెంథ్…నువ్వు నాకొక చిన్న పిల్లాడివి… నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ..నువ్వు లేవని గుర్తొచ్చిన ప్రతి క్షణం ..వేలాదిసార్లు చస్తున్నంత నరకంగా ఉంది..నువ్ లేవని దిగాలుపడిన ప్రతిక్షణం నువ్వ నా చుట్టు ఉండి నన్ను సంరక్షిస్తున్నట్టుగా ఉంది..”
“నన్ను వదిలి ఉండలేనంతగా ప్రేమించావ్..ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నావ్.. మన ప్రేమకి గుర్తుగా నీ రూపం నా కడుపులో పెరుగుతుంది.. మన బిడ్డని ఈ భూమిపైకి తీసుకువచ్చేందుకు నేనెంతగానో ఎదురు చూస్తున్నాను..మన పాపలో నీ నవ్వులు చూసేందుకు ,నీ నవ్వులతో గదంతా వెలుగులు విరజిమ్మేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను..నా శ్వాస ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు.. నాలో ఉన్నది నీవే.. ఐ లవ్ యూ చిరూ..” అంటూ మేఘన పెట్టినపోస్టు అందరిని ఏడిపించేస్తుంది..
మేఘన పోస్ట్ పై రెస్పాండ్ అవుతూ నెటిజన్స్ తనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.. మేఘన తోటి నటులు కూడా కామెంట్స్ రూపంలో చిరుని తలచుకుంటూ..పాప రూపంలో చిరు మన మధ్యకు వస్తాడు.. మనతో ఉంటాడు అని మేఘనలో కొత్త ఆశలు నింపడానికి ప్రయత్నిస్తున్నారు.. మేఘన కోరుకుంటున్నట్టగా వారి పాప ఆయురారోగ్యాలతో పుట్టాలి..
End of Article