“శక్తి నాకే అర్థం కాలేదు..!” అంటూ… ఎన్టీఆర్ “శక్తి” సినిమాపై “మెహర్ రమేష్” కామెంట్స్..!

“శక్తి నాకే అర్థం కాలేదు..!” అంటూ… ఎన్టీఆర్ “శక్తి” సినిమాపై “మెహర్ రమేష్” కామెంట్స్..!

by Megha Varna

Ads

ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈ సినిమా 2011లో విడుదల అయింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఇలియానా ఈ సినిమాలో నటించింది. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Video Advertisement

నిర్మాతగా అశ్విని దత్ వ్యవహరించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమాకి సంబంధించి మెహర్ రమేష్ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు.

శక్తి సినిమా నాకే అర్థం కాలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సినిమా గురించి మెహర్ రమేష్ చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం. శక్తి సినిమాని చాలా దేశాలు తిరిగి చిత్రీకరించడం జరిగింది శక్తి సినిమాని 30 రోజుల పాటు లైట్లు కానీ జనరేటర్ కానీ లేకుండా షూట్ చేశారట. మెహర్ రమేష్ కి సినిమాల గురించి చాలా చక్కటి అవగాహన ఉంది ఏ మార్పులు ఎక్కడ చేయాలి..?, కథని ఎలా తీసుకురావాలి.? సినిమా ఎలా ప్లాన్ చేయాలి ఇవన్నీ కూడా బాగా తెలుసని మహర్ రమేష్ అన్నారు. శక్తి సినిమాకి నిర్మాతక వ్యవహరించిన అశ్విని దత్ దర్శకుడినే పూర్తిగా బడ్జెట్ కి సంబంధించి విషయాలను చూసుకోమని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఇది పెద్దగా ఆడియన్స్ కి ఎక్కలేదు. దీనికి గల కారణం ఏమిటి అనేది మెహర్ రమేష్ చెప్పారు.

మామూలుగా మొదట అనుకున్న కథ వేరు తీసిన కథ వేరు అని చెప్పారు. ఒక గైడ్ ఉంటాడని ఆ గైడ్ హోమ్ మినిస్టర్ కూతుర్ని కాపాడతాడని అయితే తను గైడ్ కాదని ఒక ఆఫీసర్ అని అనుకున్నారు.  రెండవ పార్ట్ వచ్చే సరికి లవ్ స్టోరీ ఉంటుంది అని మొదట ప్లాన్ చేసుకున్నారు. కానీ దత్ మాత్రం దర్శకుడితో భక్తి పార్ట్ ని యాడ్ చేయమని… కొంత మంది రచయితలను కూడా ఇచ్చారట. రెండవ పార్ట్ ని శక్తి పీఠాలు వంటివి చేర్చారు. నాకే అర్ధం కావడం లేదని కూడా మెహర్ రమేష్ చెప్పారట. కానీ ఆఖరికి ఇలా సినిమా తీసి విడుదల చేసేసారు కానీ ప్రేక్షకులకి ఎక్కలేదు. మొదట భాగం ఒకలా రెండో భాగం మరోలా ఉంటుంది శక్తి సినిమా.

watch video :


End of Article

You may also like