Ads
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంత సరదాగా ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా ఈవెంట్ కి అటెండ్ అయితే, ఆ ఈవెంట్ కే సందడి వస్తుంది. ఇంక ఒకవేళ మెగాస్టార్ మాట్లాడారు అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి మాట్లాడుతుంటే ఏదో ఒక ఫార్మల్ స్పీచ్ లాగా కాకుండా, నిజంగానే అక్కడ ఉన్న ప్రేక్షకులతో తను ఎలా ఫీల్ అవుతున్నారో అనే విషయం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది.
Video Advertisement
అయితే గత కొంత కాలం నుండి మెగాస్టార్ ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా మాటల మధ్యలో పొరపాటున సినిమా గురించి బయట ఎక్కడా మాట్లాడని విషయాలను చెప్పేస్తూ ఉన్నారు. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతాడు అని బయట ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఎంత బాగుందో చెప్తూ మధ్యలో ఈ విషయం గురించి కూడా ప్రస్తావించారు చిరంజీవి.
తర్వాత, చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. బ్రహ్మాజీ కొడుకు హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పొరపాటున తాను – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఆచార్య అని పేరు చెప్పేశారు.
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ఫినాలేకి వచ్చినప్పుడు కూడా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్నారు అని అప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అని వస్తున్న వార్తలన్నీ నిజమే అని కన్ఫర్మ్ చేస్తూ చెప్పారు. అయితే చిరంజీవి కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవి యాక్టివ్ గా ఉంటారు.
జనవరి 26 వ తేదీన సాయంత్రం తన ట్విట్టర్ లో “నాకు కొరటాల శివతో ఒక సీరియస్ కాన్వర్జేషన్ జరిగింది. 6:30 కి అప్డేట్ చేస్తాను.” అని ట్వీట్ చేశారు. అప్పటికే సోషల్ మీడియా అలర్ట్ అయ్యింది. తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణని మీమ్ లాగా పోస్ట్ చేశారు. అందులో “ఏమయ్యా కొరటాల, ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు. సంక్రాంతికి లేదు. ఇంకెప్పుడు” అని చిరంజీవి అడగగా, “సర్ అదే పనిలో ఉన్నా!” అని కొరటాల శివ అంటారు.
అప్పుడు చిరంజీవి “ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా” అని అంటే, అందుకు కొరటాల శివ “రేపు మార్నింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తా సార్!” అని అంటారు. అప్పుడు చిరంజీవి “ఇస్తావుగా” అని అంటారు. అందుకు కొరటాల శివ “అనౌన్స్మెంట్ రేపు మార్నింగ్ 10 a.m. ఫిక్స్ సర్” అని అంటారు. ఇలా 10:00 కి ఆచార్య అనౌన్స్మెంట్ ఉంది అని ప్రకటించారు.
కానీ ఎనౌన్స్ మెంట్ తో పాటు నెటిజన్ల దృష్టి పడింది మాత్రం మీమ్ మీదే. సాధారణంగా సినిమా అప్డేట్ అంటే ఏ పోస్టర్ ద్వారానో, లేదా ట్వీట్ ద్వారానో, అది కూడా కాదు అంటే ఒక చిన్న వీడియో బైట్ ద్వారానో చెప్తారు. కానీ ఆచార్య సినిమాకి అలా కాకుండా, ఇలా డిఫరెంట్ గా మీమ్ రూపంలో అప్డేట్ గురించి చెప్పారు.
అంటే సినిమా బృందం సోషల్ మీడియా ట్రెండ్ ఎంత బాగా ఫాలో అవుతున్నారో మనమే అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క ఉదాహరణ చాలదా? మెగాస్టార్ సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతారు అని చెప్పడానికి. మెగాస్టార్ అప్డేట్ మీమ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #2 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14
#15 #16
End of Article