” దేనికైనా రెడీ” లో నేను లేను మంచు మనోజ్ ఇచ్చిన కౌంటర్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్.

” దేనికైనా రెడీ” లో నేను లేను మంచు మనోజ్ ఇచ్చిన కౌంటర్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్.

by Mohana Priya

Ads

మంచు మనోజ్ తెరపై కనిపించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. తన వ్యక్తిగత విషయాల కారణంగా మధ్యలో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2017 లో విడుదలైన ఒక్కడు మిగిలాడు తర్వాత ఇప్పటివరకు మనోజ్ నటించిన సినిమా విడుదల కాలేదు. అయితే ఇటీవల అహం బ్రహ్మాస్మి సినిమా ప్రకటించారు మనోజ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ గ్యాప్ లో సినిమాలకు దూరంగా ఉన్నా కానీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారు మనోజ్.

Video Advertisement

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. ఇటీవల జెమినీ టీవీ కూడా ఇలాంటి ఒక చిన్న పొరపాటు చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలో ఉంది. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం, ఒక సినిమా టెలికాస్ట్ అవుతుంటే ఇంకొక సినిమా పేరు వేస్తారు, లేదా టెలికాస్ట్ టైమింగ్ పొరపాటు గా చెప్తారు. సెప్టెంబర్ 10 వ తేదీన మంచు విష్ణు నటించిన సూపర్ హిట్ సినిమా దేనికైనా రెడీ జెమినీ టీవీ లో మధ్యాహ్నం టెలికాస్ట్ చేశారు.

జెమినీ టీవీ ట్విట్టర్ ఎకౌంట్ లో ” దేనికైనా రెడీ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఏంటి?” అని ప్రశ్న పోస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ హీరో పేరు మంచు మనోజ్ అని రాశారు. ” దేనికైనా రెడీ సినిమాలో మంచు మనోజ్ పాత్ర పేరు ఏంటి?” ఇది ప్రశ్న.

ఈ ప్రశ్న మంచు మనోజ్ దృష్టికి వెళ్లింది. “నేను దేనికైనా రెడీ ఏ. కానీ ఆ సినిమాలో నేను లేను” అని జవాబిచ్చారు. మంచు మనోజ్ ఇచ్చిన కౌంటర్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8

#9

#10


End of Article

You may also like