Ads
పాపులారిటీ నాలుగు రకాలుగా వస్తుంది. మొదటిది చాలా కష్టపడి, తమ టాలెంట్ ద్వారా సంపాదించుకునే పాపులారిటీ. రెండవది టిక్ టాక్ లాంటి యాప్స్ వల్ల వచ్చిన పాపులారిటీ, మూడవది ఎవరినైనా ఏదైనా అంటే, లేదా పొరపాటుగా నోరు జారితే లేదా ఇంకేమైనా నెగిటివ్ పని చేసినప్పుడు వచ్చే పాపులారిటీ. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఎక్కువ మంది దీని జోలికి కూడా వెళ్లరు.
Video Advertisement
నాలుగవది వాళ్ళకి తెలియకుండా వచ్చే పాపులారిటీ. అంటే ఎప్పుడో ఏదో సాధారణంగా చేసిన ఒక పని క్లిక్ అయ్యి అది సోషల్ మీడియా దృష్టికి వెళ్లి మీమ్స్ ద్వారా పాపులర్ అవుతారు. అసలు వాళ్లు అంత పాపులర్ అయినట్టు వాళ్లకి కూడా తెలీదు. అలా పాపులర్ అయిన వాళ్లలో కోపదారి మనిషి ఒకరు.
మేలుకో తెలుగోడా అనే ప్రోగ్రాం కి వార్తలు చదువుతున్నప్పుడు, అక్కడ జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యి కెమెరా రోలింగ్ లో ఉంది అని కూడా చూడకుండా తన కోపాన్ని చూపించారు. ఆ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ గత కొంత కాలంగా యూట్యూబ్ లో ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఎక్స్ప్రెషన్స్ మీమ్ మెటీరియల్ అయిపోయాయి.
అలా కోపదారి మనిషి పేరుతో పాపులర్ అయిన ఆయన అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఆయన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ లో కనిపించారు. ఆయన పేరు కృష్ణ మోహన్. దాంతో మళ్లీ సోషల్ మీడియా లో కృష్ణ మోహన్ సడన్ రీ ఎంట్రీ మీద మీమ్స్ మొదలయ్యాయి. అలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
End of Article