“పుష్ప”లోని ఈ సీన్‌లో… అల్లు అర్జున్‌కి వచ్చిన “మెసేజ్” ఏంటో తెలుసా..?

“పుష్ప”లోని ఈ సీన్‌లో… అల్లు అర్జున్‌కి వచ్చిన “మెసేజ్” ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

message that hero receives in pushpa

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

message that hero receives in pushpa

ఇందులో హీరో, హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. హీరో అది చూసి వదిలేస్తాడు. అయితే సోషల్ మీడియాలో ఎవరో ఈ సీన్ స్క్రీన్‌షాట్ షేర్ చేసి, “ఈ సీన్ లో అల్లు అర్జున్ కి ఏదో మెసేజ్ వచ్చింది. అది ఏం మెసేజ్? ఎవరి నుండి వచ్చింది?” అని ట్వీట్ చేశారు. అందుకు ఒకరు, “మీ రోజువారీ హై స్పీడ్ డేటా లిమిట్ అయిపోయింది. మళ్లీ రీఛార్జ్ చేసుకోండి. అని మెసేజ్ వచ్చింది” అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


End of Article

You may also like