సందీప్ కిషన్ “మైఖేల్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

సందీప్ కిషన్ “మైఖేల్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యి చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మజిలీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, గౌతమ్ మేనన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి అయ్యింది. సినిమా సెన్సార్ టాక్ ఇదే అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది.

michael censor talk

సినిమా సెన్సార్ టాక్ చాలా బాగుంది అని అంటున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లో బెస్ట్ సినిమా ఇదే అని సమాచారం. సినిమాలో హీరో, హీరోయిన్ అని కాకుండా మొత్తం కంటెంట్ మీదే నడుస్తుంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కి మంచి పాత్ర లభించింది. అలాగే ట్రైలర్ చూసి ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే అనుకుంటున్నారు. కానీ యాక్షన్ తో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంది. దాంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

michael censor talk

అలాగే నటన విషయంలో కానీ, తనని తాను మార్చుకున్న విషయంలో కానీ సందీప్ కిషన్ కి చాలా ప్రశంసలు దక్కాయి. ఇప్పటివరకు అసలు చేయని ఒక పాత్రలో సందీప్ నటించారు అని సమాచారం. అలాగే విజయ్ సేతుపతికి కూడా మరొకసారి గొప్ప పర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఉన్న ఒక మంచి పాత్ర దొరికింది అని అంటున్నారు.

michael censor talk

ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఇందులో నటించిన చాలా మంది నటీనటులు తెలుగు, తమిళ్ భాషలకి చెందిన వారు ఉన్నారు .సినిమా సెన్సార్ టాక్ అయితే ఇలా ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like