భారత్ పాక్ మధ్య ఉండే ఘర్షణల గురించి అందరికి తెలిసిందే. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్‌లోకి చొరబడుతున్నాయి. గుజరాత్‌లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ మిడతల దండు 8 వేల హెక్టార్లకు పైగా పొలాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం కలిగించిందని, బనాస్‌కాంఠా జిల్లాలో సుయీగామ్, డాంటా, థరాడ్, వావ్ తాలూకాల్లో రైతులపై ఈ ప్రభావం చాలా ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి.

Video Advertisement

ఈ బెడదను ఎదుర్కోవడానికి కేంద్ర బృందాలు క్రిమిసంహారక మందులు చల్లించడం సహా అన్ని చర్యలనూ చేపడతాయని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పొలాల్లో టైర్లను మండించడం; డప్పు, ప్లేట్లను మోగించడం, పొలాల వద్ద టేబుల్‌ ఫ్యాన్‌లు పెట్టడం, లౌడ్‌ స్పీకర్స్ పెట్టడం, డ్రోన్ల సాయంతో కొంతవరకు నిషేదించారు.

ర్షాలు కురిసి పంటలు వేయడం మొదలుపెడితే మిడతల దండు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాదు, మిడతల పునరుత్పత్తికి మార్చి నెల అనుకూలమైనది కావడంతో వాటి సంతతిని అరికట్టేందుకు రెండు దేశాలు అనేకమార్లు చర్చలు జరిపాయి. ఈ సారి అరికట్టకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది.