మంత్రి హరీష్ రావు గారితో ఆ రైతు ఏమన్నారో చూస్తే నవ్వాపుకోలేరు..! వైరల్ వీడియో.!

మంత్రి హరీష్ రావు గారితో ఆ రైతు ఏమన్నారో చూస్తే నవ్వాపుకోలేరు..! వైరల్ వీడియో.!

by Megha Varna

Ads

కరోనా కరోనా దేశమంతటా ఇదే టాపిక్ ఎవరు మాట్లాడుకున్న టీవీ ఆన్ చేసిన మొత్తం ఇదొక్కటే వార్త ..ఇప్పటికే లాక్ డౌన్ విధించగా ఇంటికే పరిమితం అయినా జనం ఎప్పటికప్పుడు నమోదు అవుతున్న తాజా కరోనా పాజిటివ్ కేసులు గురించి తెలుసుకుంటూ భయాందోళనలకు గురి అవుతున్నారు …వైరస్ వ్యాప్తి చెందకుండ సామజిక దూరం పాటిస్తూ తమని తాము రక్షించుకుంటున్నారు సాధారణ జనం .కాగా పోలీస్ లు డాక్టర్ లు ఇతరత్రా అత్యవసర సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పై యుద్ధం చేస్తూ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారు ..

Video Advertisement

ఈ నేపథ్యంలో చాలా మంది పేద వారికీ బియ్యం కూరగాయలు పంచిపెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ..రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కందిపప్పు ఇప్పటికే పంపిణి చేసింది . కాగా రాజకీయ నాయకులూ సైతం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు చేరువై తమదైన సాయం అందింస్తున్నారు ..ఇప్పటికే అంబానీ ,టాటా లాంటి బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు విరాళంగా ఇచ్చి దేశానికీ అండగా నిలబడ్డారు ..ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గ్రామాలలో పరిస్థితి వీక్షించడానికి వెళ్లగా అక్కడ ఒక పెద్దాయనతో జరిపిన చర్చకు సంసంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దామా .

 

కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత టిఆర్ఎస్ పార్టీ లో చేరి తెలంగాణ రావడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి కెసిఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు . ఈయన ఒక విలక్షణమైన బాధ్యతగల రాజకీయ నాయకులలో ఒకరు ..హరీష్ రావు అకస్మాత్తుగా గవర్నమెంట్ పాఠశాలలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను పరిక్షిణించి వారి లోటు పాట్లను ఎత్తి చూపించిన వీడియో యూట్యూబ్ లో ప్రశంసలు అందుకుంటుంది ..ఏ  విషయాన్నీ అయినా అరటిపండు వలిచినట్లు చెప్పడం హరీష్ రావు స్పెషలిటీ ..ఇప్పటికే ఆరు సార్లు ఎంయల్ఏ గా గొలుపొందిన హరీష్ రావు గత ఎన్నికలలో లక్ష ఇరవై వేలకు పైగా మెజారిటీ తో గెలుపొందారు .

ఈ కరోనా నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం హరీష్ కరోనా పరిస్థితిని స్వయంగా వీక్షించడానికి వెళ్లగా అక్కడ ఒక పెద్దయన్తో కార్ లో నుండే చర్చ జరిపారు ..ఏం పెద్దయన ఎలా వున్నావ్ అని అడగగా మంచిగానే వున్నాను అని ఆ పెద్దాయన బదులు చెప్పగా …ఏదో ఎయిడ్స్ అంట అంటుకుపోతుందంట జనాలు ఎవరు బయటకు రావట్లేదు అని చెప్పుకొచ్చాడు ఆ పెద్దాయన ..ఆ పెద్దాయనకు కరోనా అని తెలియక ఎయిడ్స్ అని అనడం హరీష్ కు నవ్వు తెప్పించింది ..

బర్రెలు పాలు ఇస్తున్నాయా వ్యవసాయం ఎలా ఉంది అని అడగగా… వ్యవసాయం చెయ్యట్లేదు ఆ రోగం కారణంగా, బర్రె లు పాలు ఇస్తున్నాయి ..అమ్మవారికి పూజ చేస్తున్నాం అని చెప్పాడు పెద్దాయన దానికి హరీష్ ఎందుకు అని అడగగా మా ఊరిలోకి ఆ రోగం రాకూడదని అందరు మంచిగా ఉండాలని చెప్పుకొచ్చాడు ఆ పెద్దాయన ..అయితే సరే అని అన్నారు హరీష్ రావు …దీనికి సంభందించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుండగా ..మంత్రి హరీష్ నిజమైన బాధ్యత కలిగిన నాయకుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

watch video:


End of Article

You may also like