Ads
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు క్యాబినెట్ మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు.
Video Advertisement
ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది జనం హాజరయ్యారు. గవర్నర్ తమిళసై సీఎం చేత, మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఒక క్యాబినెట్ లో మంత్రులు వివరాలు చూస్తే…
1.మల్లు భట్టి విక్రమార్క:
రేవంత్ క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
2. ఉత్తమ్ కుమార్ రెడ్డి:
మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు.
3. కోమటిరెడ్డి వెంకటరెడ్డి:
కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో వైయస్ క్యాబినెట్ లో ఐటీ మినిస్టర్ గా కూడా పనిచేశారు.
4. ధనసరి అనసూయ సీతక్క:
నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన సీతక్క ములుగు నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి రేవంత్ క్యాబినెట్ లో సీతక్కకు మంత్రి పదవి దక్కింది. సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్టేడియం దద్దరిల్లింది.
5. పొన్నం ప్రభాకర్:
పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుండి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా పనిచేశారు. ఈసారి ఆయనకు రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కింది.
6. దామోదర రాజనర్సింహ:
దామోదర రాజనర్సింహ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రేవంత్ క్యాబినెట్ లో కూడా మంత్రిగా అవకాశం దక్కింది.
7. శ్రీధర్ బాబు:
శ్రీధర్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఏఐసీసీ లో వర్కింగ్ మెంబర్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సప్లై మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఈసారి రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
8. తుమ్మల నాగేశ్వరరావు:
ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి ముగ్గురు ముఖ్యమంత్రిలతో పనిచేసిన అనుభవం తుమ్మల నాగేశ్వరరావుకు ఉంది. మొన్నటి వరకు బిఆర్ఎస్ లో ఉన్న తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా నెగ్గి ఇప్పుడు రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:
బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన పొంగలేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఇప్పుడు రేవంత్ క్యాబినెట్ లో మినిస్టర్ గా అవకాశం పొందారు.
10. కొండా సురేఖ:
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకురాలు. వైయస్ క్యాబినెట్ లో స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సిపి, బీఆర్ఎస్ లో కూడా చేరారు. మళ్లీ సొంత గుటి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మినిస్టర్ గా అవకాశం దక్కించుకున్నారు.
11. జూపల్లి కృష్ణారావు:
వైయస్ క్యాబినెట్, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మినిస్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం పొందారు.
End of Article