Home Filmy Adda “కళావతి” పాటకి మైనస్ పాయింట్ ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?

“కళావతి” పాటకి మైనస్ పాయింట్ ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.

ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. అయితే సర్కారు వారి పాట సినిమాలో సినిమాలో మొదటి పాట అయిన “కళావతి” ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

minus point in sarkaru vaari paata kalaavathi song

అందుకు కారణం ఈ పాట పాడిన సింగర్ సిద్ శ్రీరామ్ ఉచ్చారణ సరిగా లేకపోవడం అని అంటున్నారు. కొన్ని పదాలు శ్రీరామ్ సరిగ్గా పలకలేదు. ఈ ఒక్క పాట మాత్రమే కాదు అంతకు ముందు సిద్ శ్రీరామ్ పాడిన కొన్ని పాటల్లో కూడా ఇలాంటి ఉచ్చారణ పొరపాట్లు వచ్చాయి. మొదటి కంటే ఇప్పుడు ఉచ్చారణ మెరుగుపడినా కూడా చాలా పదాలు పలకడంలో పొరపాట్లు అవుతున్నాయి. దాంతో, “వేరే సింగర్ చేత పాడించాల్సింది. పాటలో చాలా పదాలు అర్థం అవ్వట్లేదు” అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో, “సిద్ శ్రీరామ్ చాలా బాగా పాడారు” అని అంటున్నారు.

sarkaru vaari paata kalaavathi copied from a recent telugu hit song

అయితే, ఈ పరిస్థితి ఇప్పుడు మాత్రమే కాదు అంతకు ముందు కూడా చాలా మంది సింగర్లకి ఎదురయ్యింది. ఉదిత్ నారాయణ్ పాడిన కొన్ని తెలుగు పాటలకు కూడా ఇలాంటి స్పందన వచ్చింది. కానీ ఉదిత్ నారాయణ్ కి తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా క్రేజ్ ఉంది. అలాగే శ్రేయ ఘోషల్ మొదట్లో పాడిన తెలుగు పాటల్లో కూడా ఇలాంటి పొరపాట్లు చాలానే అయ్యాయి. దాంతో నెటిజన్లు కూడా కళావతి పాటపై ఇలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

You may also like