Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. మిగిలిన భాషల్లో డబ్ చేశారు. ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి చాలా నెలలు అయ్యింది.
Video Advertisement
టీజర్ విడుదల చేసిన తర్వాత అందులో ఉన్న విఎఫ్ఎక్స్ కి చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమా బృందం సినిమా విడుదల తేదీ వాయిదా వేసి, మళ్లీ సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు.
అంతే కాకుండా చాలా సందర్భాల్లో సినిమాకి సంబంధించి వచ్చిన పోస్టర్స్ విషయంలో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వస్తోంది. సినిమాలో చాలా మార్పులు చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. కాకపోతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో మార్పులు చేశారు. అది అర్థం అవుతోంది. కాకపోతే ఎన్ని మార్చినా కూడా రామాయణం అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఇలాగే ఉంటుంది అనే ఒక భావన ఉంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎక్కడ మనం మన రామాయణాన్ని చూస్తున్నాము అనే ఒక విషయం అసలు అనిపించలేదు అని అన్నారు.
#2 ఒక సినిమా ప్రేక్షకులకి నచ్చాలి అంటే ఆ సినిమా నేటివిటీ ఆ ప్రాంతం వారికి దగ్గరగా ఉండాలి. అందుకే ఈ మధ్య పాన్-ఇండియన్ భాషల్లో విడుదల చేసే సినిమాలు అన్నిట్లో అన్ని భాషల నటులని తీసుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు వేరే భాషల సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో చూస్తే అదే తక్కువ అనిపిస్తోంది. ఒక్క ప్రభాస్ తప్ప ఈ సినిమాలో ఒక్క తెలుగు యాక్టర్ కూడా కనిపించట్లేదు.
సినిమా తీసే డైరెక్టర్ హిందీ భాషకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా, సినిమా ప్రాంతీయ భేదం లేకుండా విడుదల చేస్తున్నారు కాబట్టి, నటులని కూడా అలాగే తీసుకొని ఉంటే బాగుండేది. మిగిలిన పాత్రల్లో నటించేవారు ఎవరైనా కానీ, ముఖ్య పాత్రలో నటించే వారిని కాస్త తెలిసిన వారిని తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనే కామెంట్స్ వచ్చాయి. లక్ష్మణుడి పాత్ర పోషించడానికి తెలుగు ఇండస్ట్రీలో ఆ పాత్రకి సరిపోయే నటులు చాలా మంది ఉన్నారు. ఇంకొక తెలుగు యాక్టర్ ఉండి ఉంటే, లేదా మరొక సౌత్ ఇండియన్ యాక్టర్ ఎవరైనా ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు.
#3 సాధారణంగా రాముడు అంటే సౌమ్యుడు అని అంటారు. అక్కడ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా రాముడు చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. ఆయనకి కోపం రావడం అనేది అసలు జరగదు అని అంటారు. రాముడు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఆయనని చూస్తే అర్థం అయ్యేలాగా అంతకుముందు రాముడి పాత్ర పోషించిన నటుల పాత్రలు రూపొందించారు. రాముడిని నీలి మేఘ శ్యాముడు అని అంటారు.
అంతే కాకుండా రాముడికి మీసాలు ఉండడం అనేది ఇప్పటి వరకు మనం చూడలేదు. దాంతో ప్రభాస్ లుక్ పై కూడా ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ప్రభాస్ ట్రైలర్ లో చెప్పే ఒక డైలాగ్ బాహుబలి సినిమాలో చెప్పే, “ఏది మరణం?” డైలాగ్ కి దగ్గరగా ఉంది అని, రాముడు సాధారణంగా అలాంటి టోన్ లో మాట్లాడటం మనం ఎక్కడా చూడలేదు అని, ఆయన అంత గొప్ప వీరుడు అయినా సరే ఆయన చాలా శాంతంగా మాట్లాడడం చూపించారు అంటున్నారు.
#4 సినిమాలో మిగిలిన పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రావణాసురుడి పాత్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక రకంగా కథ ముందుకు వెళ్లడానికి రావణాసురుడు పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. అంత ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తికి ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా ట్రైలర్ మొత్తం ఎలా కట్ చేశారు అని కామెంట్స్ వచ్చాయి. సీత పాత్ర పోషించిన కృతి సనన్ కూడా ఒక డైలాగ్ చెప్తారు. కనీసం సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడి పాత్ర ఏదో ఒక డైలాగ్ అయినా చెప్పి ఉంటే ట్రైలర్ చాలా బాగుండేది అని అంటున్నారు.
#5 రామాయణంలో చాలా ముఖ్యమైనది యుద్ధ ఘట్టం. ట్రైలర్ లో దానికి సంబంధించి కొన్ని సీన్స్ కూడా చూపించారు. సినిమాలో యానిమేషన్ చాలా వాడారు అని మనకి ముందే తెలుసు. కానీ ఇలాంటి ముఖ్యమైన వాటిలో గ్రాఫిక్స్ తో కాకుండా కొంచెం వానరసేనని ఇంకా బాగా సహజంగా చూపించి ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు 700 కోట్లు పెట్టి తీసిన సినిమా లాగా అనిపించట్లేదు అని అంటున్నారు. అందుకే బడ్జెట్ కి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకొని ఉంటే బాగుండేది అని అంటున్నారు.
అంతకు ముందు విడుదల అయిన టీజర్ తో పోలిస్తే ట్రైలర్ లో చాలా వరకు అప్పుడు ట్రోలింగ్ కి గురైన విషయాలు లేకుండా చూసుకున్నారు అని తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు ట్రైలర్ లో చూసి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ సినిమాలో కూడా ప్రభావం పడకుండా సినిమా టేకింగ్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
watch video :
ALSO READ : ఆదిపురుష్ సినిమాలో “సైఫ్ అలీఖాన్” లాగానే… సినిమాల్లో “రావణుడి” పాత్ర పోషించిన 10 యాక్టర్స్..!
End of Article