బాలకృష్ణ “భగవంత్ కేసరి” ట్రైలర్‌లో… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?

బాలకృష్ణ “భగవంత్ కేసరి” ట్రైలర్‌లో… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?

by kavitha

Ads

నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీ వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఏడాది మొదట్లో వీరసింహారెడ్డితో విజయం అందుకున్న బాలయ్య త్వరలో భగవంత్ కేసరి మూవీతో రానున్నారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో అభిమానులు హ్యాట్రిక్ ఖాయం అని నమ్ముతున్నారు.

Video Advertisement

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పక్కా తెలంగాణ యాసతో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కొత్తగా, మాస్ గా ఉన్నాయి. అయితే ఈ  ట్రైలర్ లో రెండు విషయాలు మైనస్ అని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండున్నర నిముషాల నిడివి గల ట్రైలర్ లో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్లుగా కనిపించారు. బాలయ్య పక్కా తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్ కు సవాలు విసిరే సీన్స్ లో, బిడ్డ శ్రీలీల గురించి తల్లడిల్లిపోయే సన్నివేశాలలో బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా రొటీన్ గా ఉందని, పాత సినిమాలలోని మ్యూజిక్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారని కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా సెలెక్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: “విరూపాక్ష” సినిమాలో అసలు పాయింట్ మర్చిపోయారుగా..? అది ఏంటంటే..?


End of Article

You may also like