“బింబిసార” సినిమాకి… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?

“బింబిసార” సినిమాకి… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?

by Mohana Priya

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రం బింబిసార పైన రిలీజ్ కి ముందు నుంచి చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా కళ్యాణ్ రామ్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసే హీరో అనే పేరు ఉంది. కొత్త దర్శకులని ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు.

Video Advertisement

ఇప్పుడు అలాగే మరొక కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా మొదటిసారిగా కళ్యాణ్ రామ్ ఒక సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఇలాంటి పాత్రలో కళ్యాణ్ రామ్ నటించడం కూడా ఇదే మొదటి సారి. ఈ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు. బరువు తగ్గి, మేకోవర్ అయ్యి ఒక రాజు పాత్రకి ఎలా అయితే ఉండాలో అలాగే ఉన్నారు.

తన కష్టమంతా సినిమాలో కనిపిస్తోంది. భారీ విజువల్స్ తో ఆకట్టుకునే సినిమా ట్రైలర్స్ తో బాహుబలి మినీ వెర్షన్ ని తలపించిన ఈ సినిమా రిలీజ్ అయిన ఈ మూవీ ని కొన్ని మైనస్ పాయింట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. నటనపరంగా కళ్యాణ్ ఈ చిత్రంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అని చెప్పొచ్చు…బింబిసార క్యారెక్టర్ లో అతను నటించినట్లు కాకుండా జీవించినట్లుగా ఉంది. ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా దానికి భావోద్వేగాలు చాలా ముఖ్యం. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అసలు సినిమాకి సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి.

netizens comments on kalyan ram during bimbisara trailer launch goes viral

వాటిలో ఆ చిన్న పాప క్యారెక్టర్ చుట్టూ తిరిగే సీన్స్ మరి సినిమాకి అతికించినట్లుగా ఉన్నాయి. సాంగ్ మ్యూజిక్ పరంగా ,లిరిక్స్ పరంగా బాగున్నప్పటికీ ,సినిమాకి సాంగ్ కి సందర్భం లేని సిట్యువేషన్స్ లో వాటిని పెట్టడం వల్ల వాటి ఇంపాక్ట్ తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా జానపద పౌరాణిక నేపథ్యంలో సాగిన ఈ చిత్ర పాటల చిత్రీకరణ కమర్షియల్ పద్ధతిలోనే ఉండడం ప్రేక్షకులను కొంత నిరాశపరిచిందని చెప్పొచ్చు. పేరుకు ఇద్దరు హీరోయిన్స్, పాత్రలో ఉన్న వాళ్లకు కథలో పెర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఏది ఏమైనాప్పటికీ ఓవరాల్ గా బింబిసార చిత్రం బాక్సాఫీస్ ని గెలుచుకుంటుందని ఆశిద్దాం.


You may also like