Home Filmy Adda మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్‌లో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్‌లో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్ లో చిరంజీవి గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమాలో కూడా ఇలాగే మాస్ లుక్ తో చిరంజీవి కనిపిస్తారు. అలాగే రవితేజ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సినిమా మొదట్లో, అలాగే సినిమా చివరిలో కొంచెంసేపు రవితేజ పాత్ర ఉంటుంది అని సమాచారం.

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈ నెల మొదట్లో విడుదల అయ్యింది. ఈ సినిమాకి మంచి స్పందన వచ్చినా కూడా అంత పెద్దగా కలెక్షన్స్ రాలేదు అని అన్నారు. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య టీజర్ చూసిన ప్రేక్షకులు అందరూ ఇది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అవుతుంది అని అంటున్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవితో శ్రుతి హాసన్ నటించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చినా కూడా కొన్ని విషయాలపై కామెంట్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా టీజర్ అంటే, అందులోనూ మెగాస్టార్ సినిమా టీజర్ అంటే వీడియో ఉన్న కొంచెంసేపు అయినా కూడా టీజర్ అంతా చిరంజీవి ఉంటారు ఏమో అని అనుకుంటారు. కానీ చిరంజీవి టీజర్ సగంలో వస్తారు. అంతకుముందు ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకి సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. అందులో కూడా విలన్ గొంతు వినిపిస్తూ ఉంటుంది ప్రభాస్ మొదటి నుండి ఉంటారు. దాంతో చిరంజీవి సినిమా టీజర్ కి చిరంజీవి నిడివి ఎక్కువగా లేకపోతే ఎలా అని చాలామంది అన్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

#2 ఇలాంటి టీజర్ కి ముఖ్యమైనది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందిస్తారు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఒక టీజర్ లో హైలెట్ అవ్వాల్సిన విషయమే అది. కానీ వాల్తేరు వీరయ్య టీజర్ లో మాత్రం వెనకాల వచ్చే మ్యూజిక్ చాలా సాధారణంగా అనిపిస్తుంది. అది కూడా కొత్తగా ఏమీ అనిపించకుండా ఎక్కడో విన్నట్టు ఏదో కొన్ని హిట్ పాటలు గుర్తు చేస్తూ ఉంటుంది.

minus points in chiranjeevi waltair veerayya title teaser

#3 చిరంజీవిని వెనుకనుండి చూపించినప్పుడు చిరంజీవిలాగా అస్సలు అనిపించలేదు. చిరంజీవిని సినిమా పాత్ర కోసం కొంచెం యంగ్ గా చూపిస్తున్నారు అని అర్థం అవుతోంది. కానీ అలా చూపించే క్రమంలో క్లోజప్ షాట్స్ లో కాస్త సీజీ ఎక్కువగా వాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతా కొంచెం ఆర్టిఫిషియల్ గా కనిపించింది అంటూ చాలామంది కామెంట్ చేశారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

#4 ఈ సినిమా టైటిల్ టీజర్ అని విడుదల చేశారు. అంటే టైటిల్ ఇదే అని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో ఇది. కానీ ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని ఎంతో కాలం క్రితమే తెలుసు. దాంతో ఈ టైటిల్ ప్రకటిస్తూ ప్రత్యేకంగా టీజర్ పై ప్రేక్షకులకు అంత పెద్దగా ఆసక్తి లేదు. అందులో చిరంజీవి ఎలా కనిపిస్తారు, ఏం మాట్లాడుతారు అనే విషయం పైనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. దాంతో చిరంజీవికి ఇందులో ఒక పంచ్ డైలాగ్ అయినా ఉంటే టీజర్ ఇంకా బాగుండేది అని చాలామంది అన్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

#5 టీజర్ లో చిరంజీవి గెటప్ కి చాలా మంచి స్పందన వచ్చింది. కొంత మంది మాత్రం ముఠా మేస్త్రి సినిమా లుక్ లాగా ఉంది అంటే, కొంత మంది మాత్రం అందరివాడు సినిమా లుక్ గుర్తొచ్చింది అని అంటున్నారు. అలాగే చిరంజీవి డైలాగ్స్ చెప్పే విధానం అంతా కూడా అందరివాడు సినిమాలాగానే ఉంది అని అంటున్నారు.దాంతో లుక్ అలా ఉన్నా కూడా సినిమా ఫలితం అలా ఉండకపోతే బాగుండు అని అంటున్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

కానీ ఎన్ని కామెంట్స్ వస్తున్నా కానీ టీజర్ పై చాలా వరకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవిని ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాలో చూడాలి అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. దాంతో ఈ సినిమా టైటిల్ టీజర్ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందా లేదా తెలియాలంటే సినిమా విడుదలయ్యే అంత వరకు ఆగాల్సిందే.

watch video :

You may also like