Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించారు.
అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట కూడా వినిపిస్తోంది. ట్రైలర్ మొత్తం ఈ పాట వస్తోంది. అయితే ట్రైలర్ కి అనుకున్నంత మంచి స్పందన అయితే రావట్లేదు. ట్రైలర్ విడుదల అయ్యే ముందు చాలా అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు విడుదల అయిన టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం చాలామంది, “ఇదేంటి ఇలా ఉంది?” అంటున్నారు. అసలు ట్రైలర్ లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమా టైలర్ మొత్తం డైలాగ్స్ కంటే ఎక్కువ పాట ఉంది. సాధారణంగా ఒక ట్రైలర్ అంటే, అది కూడా ఒక తెలుగు సినిమా ట్రైలర్ అంటే కచ్చితంగా కొన్ని డైలాగ్స్ అయినా సరే ప్రేక్షకులు ఆశిస్తారు. అలాంటి డైలాగ్ ఒక్కటి కూడా లేదు. అది కూడా పూరి జగన్నాధ్ సినిమా అంటే డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. కానీ ఈ ట్రైలర్ లో అలాంటిది ఒక్కటి కూడా కనిపించలేదు.
#2 హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్నారు. ట్రైలర్ లో ఆమె ఉన్న షాట్స్ ఏవో అతికించినట్లు అనిపించాయి. అక్కడ ఆ షాట్ అవసరం లేకపోయినా కూడా కావాలి అని పెట్టినట్టు ఉన్నాయి. ఒక ఫ్లోలో సాగుతున్న ట్రైలర్ ని ఈ షాట్స్ కాస్త డిస్టర్బ్ చేసినట్టు అనిపించాయి.
#3 సినిమా టీజర్ అంచనాలను పెంచింది. దాంతో ప్రేక్షకులు అందరూ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూశారు. అంతేకాకుండా ట్రైలర్ విడుదల అయ్యే ముందు రోజు విజయ్ దేవరకొండ కటౌట్ పెట్టడం, విజయ్ దేవరకొండ కటౌట్ మాత్రమే కాకుండా కరణ్ జోహార్, అనన్య పాండే కటౌట్ కూడా పెట్టడం అనేది ఈ సినిమా గురించి ఆసక్తి ఇంకా పెంచాయి. దాంతో ప్రేక్షకులు అందరూ కూడా ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుని ఊహించుకున్నారు. కానీ ట్రైలర్ చూస్తే ఊహించుకున్న అంచనాలని అందుకోలేదు ఏమో అనిపిస్తుంది.
#4 ట్రైలర్ కట్ కూడా చాలా డల్ గా ఉంది. ఏ ఒక్క చోట కూడా ఒక్క హై ఇచ్చే సీన్ కానీ, షాట్ కానీ లేదు. ట్రైలర్ చివరిలో మైక్ టైసన్ కనిపిస్తారు. కానీ అది కూడా సడన్ గా చూస్తే బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి సీన్ గుర్తొచ్చేలాగా ఉంది. ట్రైలర్ లో స్టోరీ అర్థం అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశం మంచిదే. కానీ ఇందులో చూస్తే మాత్రం ట్రైలర్ లో ఒక్క మంచి పూరి మార్క్ షాట్ కూడా లేదు.
#5 అంతే కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా షేడ్స్ కూడా ఈ సినిమా ట్రైలర్ లో చాలా కనిపించాయి. ట్రైలర్ కింద కామెంట్స్ లో కూడా, “అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి బదులు అమ్మ నాన్న ఒక ముంబై అమ్మాయి ఏమో” అని కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన కథ కూడా కొత్తగా లేకపోవడంతో ఈ సినిమా ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం అయితే లైగర్ ట్రైలర్ కి ఈ స్పందన వస్తోంది. దాంతో చాలామంది సినిమా బాగుంటే అదే చాలు అని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article