తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్ష పెంచుకున్న మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు A1గా, అతని తమ్ముడు శ్రవణ్ A2గా ఉన్నారు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు.ఈ తరుణంలో ఆయన.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో నిన్న రాత్రి గదిని అద్దెకు తీసుకున్న మారితీరావు… ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యా? అనే కోనంలో పోలీసుల విచారణ జరగుతోంది.
మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించింది. ఈ ఆత్మహత్యపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని చెప్పింది.. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు.ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రితో ఎప్పుడు కలవలేదని, కనీసం చూడలేదని తెలిపింది. ఇక చేసిన తప్పును తెలుసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నారేమో అని వ్యాఖ్యానించింది అమృత.