Ads
సింగర్ సునీత అంటే.. కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పాటకు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో లెక్కలేదు. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా.. ఒంటరిగా తన సమస్యలను తాను సాల్వ్ చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసారు. ఇటీవలే.. రామ్ తో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Video Advertisement
ఆమె పట్ల విమర్శలు చేసే వారి సంగతి ఎలా ఉన్నా.. ఆమెను అభిమానించే వారికి మాత్రం కొదవ లేదు. చాలా మంది ఆమె ను చూసి ఇన్స్పైర్ అయ్యే వారు కూడా ఉన్నారు. సునీత ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సునీత ఒక మామిడి చెట్టు దగ్గర నిల్చుని ఉన్నారు. దాంతో “సునీత గర్భవతి కాబోతున్నారా?” అని వార్తలు వచ్చాయి.
image courtesy : Instagram (upadrastasunitha)
ఈ విషయం సునీత వరకు వెళ్లడంతో సునీత స్పందించారు. “అలాంటిదేమీ లేదు అని, ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?” అని సునీత తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ విషయంపై చాలా మంది సునీతకి మద్దతు ఇస్తూ కామెంట్ చేశారు. “ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు” అని సునీతకి మద్దతు ఇస్తూ కామెంట్ చేశారు. సునీత ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.
సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ఇలాంటి నెగిటివ్ వార్తలు రావడం మొదలయ్యాయి. చాలా మంది నెటిజన్లు కూడా సునీత ఏదో తప్పు చేసినట్టు కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఆమె వ్యక్తిగత విషయం. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంటుంది. చాలా ఆలోచించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మన మీద అలాంటి కామెంట్స్ వస్తే బాధపడతాం. కానీ సునీత ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి సునీత వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు రాయడం ఎంతవరకు మంచిది? వీటి వల్ల కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా వారి కుటుంబానికి కూడా ఎంతవరకు ప్రభావం పడుతుంది?
ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారా? సెలబ్రిటీ అయినా మామూలు వ్యక్తి అయినా సరే ఇలా ఒకరి వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేయడం అనేది మంచి విషయం అస్సలు కాదు. ఒకవేళ ఇదే మనపై కానీ, మనకి దగ్గర వారిపై కానీ జరిగితే మనం ఇలాగే కామెంట్ చేస్తామా? అలాగే కామెంట్ చేసిన వారిని ఊరుకుంటామా? ఇలా మనం ఒకరిపై కామెంట్ చేస్తే తర్వాత మనల్ని కూడా ఒకరు కామెంట్ చేసే సందర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి దూరి, వారి గురించి ఏమీ తెలియకుండా, వారికి సంబంధించిన విషయాలని ఇలా మాట్లాడడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించాలి.
End of Article