మిస్ ఇండియా ఫైనలిస్ట్ నుండి సివిల్ సర్వీస్ 93 ర్యాంక్…ఐశ్వర్య ఫాలో అయిన 10+8+6 టెక్నిక్ ఏంటో తెలుసా?

మిస్ ఇండియా ఫైనలిస్ట్ నుండి సివిల్ సర్వీస్ 93 ర్యాంక్…ఐశ్వర్య ఫాలో అయిన 10+8+6 టెక్నిక్ ఏంటో తెలుసా?

by Sainath Gopi

Ads

యూపీఎస్సీ 2019 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఐశ్వర్య షియోరన్ ఉత్తీర్ణులు అయ్యారు. ఐశ్వర్య ఆల్ ఇండియా స్థాయిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో 93 ర్యాంక్ సాధించారు. 2020 ఆగస్టు 4 న ఫలితాలు విడుదలైన తర్వాత నుంచి గ్లామర్ ప్రపంచం నుండి సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ అయిన ఐశ్వర్య కథ అందరి దృష్టిని ఆకర్షించింది.

Video Advertisement

ఐశ్వర్య ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత వేరే మోడలింగ్ అసైన్మెంట్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఐశ్వర్య కు మిస్స్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొనమని సలహా ఇవ్వడంతో ఐశ్వర్య మిస్ ఇండియా లో పాల్గొన్నారు. ఐశ్వర్య తల్లి ఐశ్వర్య ని మోడల్ గా చూడాలి అనుకున్నారు. అందుకే హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరుమీద ఐశ్వర్య కి ఆ పేరు పెట్టారు.

ఐశ్వర్య కి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఆసక్తి. ఎప్పుడూ చదువులో ముందుండేవారు. యూపీఎస్సీ కి కూడా అంతే శ్రద్ధగా చదివేవారు ఐశ్వర్య. 2018 లో యుపిఎస్సి కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు.

యుపిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐశ్వర్య సోషల్ మీడియా జోలికి వెళ్లలేదట. ఐశ్వర్య సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే సమయంలో ఒక ఫార్ములా పాటించే వారట.

అదేంటంటే 10+8+6. అంటే 10 గంటల ప్రిపరేషన్, 8 గంటల నిద్ర, 6 గంటలు ఇతర యాక్టివిటీస్.

ఇంకొక విషయం ఏంటంటే ఐశ్వర్య బయట ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా తనంతట తానే చదువుకొని యూపీఎస్సీ పరీక్షలు పాసయ్యారు. ఐపీఎస్ మహేష్ భగవత్ ఐశ్వర్యకు సహాయం చేశారట. స్టడీ మెటీరియల్ లో, మోక్ టెస్ట్ లో ఐశ్వర్యని గైడ్ చేశారట.

ఐశ్వర్యకు ఇంటర్వ్యూ ఎలా అవుతుందో అని భయం ఉండేదట. మహేష్ భగవత్ సహాయం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటర్వ్యూ ఇవ్వగలిగారట ఐశ్వర్య. యూపీఎస్సీ పరీక్ష పాస్ అవ్వాలంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అని,

ఇతర విషయాలను, ముఖ్యంగా మనల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసే విషయాలను అయితే అసలు పట్టించుకోకూడదు అని, కేవలం చదువు పై మాత్రమే శ్రద్ధ పెట్టాలి అని, అలా అయితే మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని ఐశ్వర్య అన్నారు.


End of Article

You may also like