పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చేసిన తప్పులు ఇవే… ఆర్.బి.ఐ అందుకే నిషేధించింది.!

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చేసిన తప్పులు ఇవే… ఆర్.బి.ఐ అందుకే నిషేధించింది.!

by Mounika Singaluri

Ads

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం ప్రస్తుతం చిక్కుల్లో పడింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ను ఆర్బిఐ నిషేధించి సంచలన సృష్టించింది. అసలు పేటీఎంను ఆర్బిఐ ఎందుకు నిషేధించింది దీని వెనకాల కారణం ఏంటి అని పరిశీలిస్తే….!

Video Advertisement

ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం ఆ నిబంధనను పాటించలేదు. పేటీఎంకు భారీ ఖాతాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి కేవైసీ సమాచారం లేదు. పేరులేని ఈ ఖాతాల నుంచి కోట్లాది రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ అనుమానిస్తోంది.

mistake by paytm payments bank

ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా లక్షలాది మంది కస్టమర్లు ప్రభావితులయ్యారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంలో లావాదేవీలు జరపవచ్చా? పేటీఎం వ్యాలెట్‌లో డిపాజిట్ చేసిన డబ్బు ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలతో పేటీఎం వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నివేదికల ప్రకారం 1000 యూజర్స్ కి సంబంధించిన అకౌంట్స్ ఉంటే వాటి అన్నింటికీ ఒక్కటంటే ఒక్కటే పాన్ ఉన్నట్టు సమాచారం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆడిటర్లు వెరిఫికేషన్ చేసినప్పుడు వారు ఇందులో భారీ అక్రమాలను కనుగొన్నారు. అప్పుడే పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా సమాచారం అందించింది. ఈ ఆర్థిక మోసానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్లు సమాచారం. పేటీఎం పేమెంట్స్ ద్వారా చెత్త వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయా లేదా అనేది ఈడి పరిశీలిస్తుంది.


End of Article

You may also like