Ads
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.
Video Advertisement
అలా అత్తారింటికి దారేది సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. హీరో తన అత్తని మళ్ళీ తన తాతతో కలపడానికి ఇండియాకి వస్తారు.
తాను ఒక కార్ డ్రైవర్ గా తన అత్త ఇంట్లో చేరుతారు. అయితే హీరో అత్త భర్తకి సహాయం చేయడానికి నర్స్ గా అలీ వస్తారు. తర్వాత ఒక సందర్భంలో హీరో అలీకి తన గురించి మొత్తం చెప్పినా కూడా అలీ నమ్మరు. తర్వాత ఒక సీన్ లో హీరో అలీకి తను నిజంగా తన అత్త కోసం వచ్చాను అని, తనకి పనులు ఏమీ తెలియవు అని, తనకు సహాయం చేయడానికి స్టాఫ్ ఉన్నారు అని చెప్తారు. అలాగే వాళ్ళందరూ ఏమేం పనులు చేస్తారో కూడా చూపిస్తారు.
అయితే అప్పుడు అలీకి కొంత డబ్బు ఇచ్చి పంపియమని ఎమ్మెస్ నారాయణ గారికి చెప్తారు. అలా ఒక సూట్ కేస్ లో ఉన్న డబ్బు మొత్తం అలీకి ఇచ్చేయమని చెప్తారు. ఎమ్మెస్ నారాయణ గారు, హీరోతో, అలీ సూట్ కేస్ డబ్బు హ్యాండిల్ చేయలేరు ఏమో అని చెప్తారు. అప్పుడు హీరో ఏం పర్లేదు ఇచ్చేసేయమని చెప్తారు. డబ్బులు తీసుకొని వెళుతూ అలీ సూట్ కేస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే లాక్ చేసి ఉండటం వల్ల సూట్ కేస్ ఓపెన్ అవ్వదు.
అప్పుడు మళ్ళీ వచ్చి సూట్ కేస్ లాక్ ఏంటి అని అడుగుతారు. ఈ సీన్ గమనిస్తే ఇందులో ఆల్రెడీ సూట్ కేస్ తెరిచే ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. అయితే ఈ పొరపాటు వల్ల సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు. ప్రేక్షకులు కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనే విషయం అందరికీ తెలుసు.
watch video:
End of Article