“జులాయి” సినిమాలో ఇంత పెద్ద పొరపాటు జరిగిందా..? ఏకంగా హీరో గురించే..?

“జులాయి” సినిమాలో ఇంత పెద్ద పొరపాటు జరిగిందా..? ఏకంగా హీరో గురించే..?

by Mohana Priya

Ads

సినిమాల్లో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో కొన్ని పొరపాట్లని మాత్రం వాటిని పొరపాటు అనాలో లేకపోతే ఆ సినిమా టీం నిర్ణయం అనాలో మనకి తెలియదు. అలా ఒక క్వశ్చన్ మార్క్ తో వదిలేస్తారు. ఇలాంటిదే ఒక సినిమాలో జరిగింది. విషయం ఏంటంటే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జులాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

ఇప్పటికి కూడా టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమాని చాలా మంది చూస్తారు. జులాయి సినిమాకి ఇప్పటికి కూడా అంత క్రేజ్ ఉంది. అయితే, సినిమా విడుదలైన 9 సంవత్సరాల తర్వాత ఇందుకు సంబంధించిన ఒక పొరపాటు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఇందులో హీరో అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు. దాంతో బిట్టు హీరో పై కోపం పెంచుకుంటాడు. బిట్టు నుండి తప్పించుకోవడానికి హీరో ఒక ప్లాన్ వేస్తాడు. తను చనిపోయినట్టు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేయమని పోలీసులకు సలహా ఇస్తాడు.

Name mistake in Julayi

హీరో చెప్పినట్టు పోలీసులు కూడా అదే సలహా పాటిస్తారు. అయితే, ఇందులో హీరో పోషించిన పాత్ర పేరు రవీందర్ నారాయణ్. కానీ పేపర్ లో పడిన ఫోటోలో మాత్రం రవి కుమార్ అని పడుతుంది. బిట్టుకి ఆల్రెడీ హీరో గురించి అంతా తెలుసు. అంతే కాకుండా హీరో తానే చనిపోయినట్టు చిత్రీకరించాలి అనుకుంటాడు. మరి అలాంటప్పుడు పేరు మార్చడం ఎందుకు? ఇది ఫేక్ న్యూస్ కాబట్టి పేరు మార్చారా? లేదా నిజంగానే పొరపాటు జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం గురూజీ కే తెలియాలి మరి.


End of Article

You may also like