పుష్ప-2 పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

పుష్ప-2 పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Harika

Ads

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమా బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సమయాన్ని సినిమా పబ్లిసిటీ అవ్వడానికి వాడుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది మంచి స్ట్రాటజీ అవుతోంది. ఇప్పటికే పుష్ప-2 నుండి పుష్ప పుష్ప పాట విడుదల అయ్యింది. ఇందులో గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, స్లిప్పర్ స్టెప్ అంటూ మూడు రకాల స్టెప్స్ వీడియోలో చూపించారు. ఇప్పుడు అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ స్టెప్స్ మీద రీల్స్ చేసి అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సినిమా నుండి మరొక పాట విడుదల అయ్యింది.

Video Advertisement

mistake in pushpa 2 song

ఈ పాటకి కపుల్ సాంగ్ అని పేరు పెట్టారు. పాట వీడియో కూడా చాలా కొత్తగా రిలీజ్ చేశారు. అంటే, పాట రిహార్సల్ వీడియోని విడుదల చేశారు. అందులోనే పాట లిరిక్స్ కూడా యాడ్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రయోగం. ఈ పాటని అన్ని భాషల్లో కూడా శ్రేయ ఘోషల్ పాడారు. గణేష్ ఆచార్య ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. లిరికల్ వీడియోలో ఆయన కూడా కనిపిస్తున్నారు. సెట్టింగ్స్ చూస్తూ ఉంటే ఈ పాట జాతరలో వచ్చే పాట అని అర్థం అవుతోంది. కొరియోగ్రఫీ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇదే పాటలోని ఒక స్టెప్ కూడా ఇప్పటికే విడుదల చేశారు.

ఈ స్టెప్ మీద కూడా ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే, ఈ పాటలో ఒక మిస్టేక్ చేశారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ పాటలో హీరో చైర్ లో రష్మిక మందన్న కూర్చున్నారు. హీరోయిన్ చైర్ లో అల్లు అర్జున్ కూర్చున్నారు. రిహార్సల్ వీడియో అనే కాన్సెప్ట్ మీద ఈ పాట తీశారు. ఇది నిజంగా రిహార్సల్ వీడియో కాదు. దాంతో అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ, చైర్ ల విషయంలో లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరొక పక్క సుకుమార్ డైరెక్టర్ అని పేరు ఉన్న కుర్చీలోనే కూర్చున్నారు. అందుకే ఈ మిస్టేక్ ఎలా చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like