Home Filmy Adda “రాధే శ్యామ్” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా… ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

“రాధే శ్యామ్” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా… ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Mohana Priya

దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొద‌ట చాలా మిక్స్‌డ్‌గా వ‌చ్చింది.

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదు అని, సినిమా చాలా స్లోగా ఉంది అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ లవ్ స్టోరీ అంటే సాధరణంగా చాలా స్లోగా ఉంటుంది.

radhe shyam movie review

“ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి” అని చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఒక పొరపాటు జరిగింది. అదేంటంటే, హీరో భవిష్యత్తు గురించి అనుకునేది తప్పు అని చెప్పడానికి హీరోయిన్ తనకు తానే యాక్సిడెంట్ చేసుకుంటుంది. ఈ యాక్సిడెంట్ లో హీరోయిన్ కి దెబ్బలు తగులుతాయి.

changes in radhe shyam telugu and hindi versions

హీరోయిన్ తలకి గాయం అవుతుంది. ఆపరేషన్ చేస్తారు. అయితే సాధారణంగా తలకు గాయమైనప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు జుట్టు తీసేస్తారు. కానీ లాస్ట్ లో హీరోయిన్ వచ్చినప్పుడు మాత్రం తలకి కట్టు ఉంటుంది అలాగే జుట్టు కూడా ఉంటుంది. దాంతో, “అంత పెద్ద సినిమా తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చూసుకోవాలి కదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “ఒకవేళ ఆ సమయంలో పొరపాటున జరిగినా కూడా ఎడిటింగ్ లో అయినా గ్రాఫిక్స్ ద్వారా అవన్నీ కనిపించకుండా కవర్ చేయాలి కదా?” అని అంటున్నారు.

You may also like