“సర్కారు వారి పాట” క్లైమాక్స్‌లో ఇది గమనించారా..? ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..?

“సర్కారు వారి పాట” క్లైమాక్స్‌లో ఇది గమనించారా..? ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యి ఇప్పుడు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చింది. పే పర్ వ్యూ ఈ పద్ధతిలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

Video Advertisement

అయితే సినిమా అన్న తర్వాత చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి ప్రేక్షకులు కూడా సినిమా చూస్తున్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ తర్వాత మళ్లీ ఒకసారి సినిమా ఎప్పుడైనా చూసినప్పుడు ఆ విషయం గురించి వస్తుంది.

mistake in sarkaru vaari paata bank scene

సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి ఒక సీన్ లో జరిగిన ఒక పొరపాటు కూడా అలాగే వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమా క్లైమాక్స్ లో హీరో బ్యాంక్ తాళాలు అన్ని తీసుకొని ఒక బ్యాంక్ లో కూర్చొని ఉంటాడు. ఆ బ్యాంక్ పేరు బయట నుండి చూస్తే భారతి స్టేట్ బ్యాంక్ అని కనిపిస్తుంది. కానీ బ్యాంక్ లోపల మాత్రం SBT అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణ అని రాసి ఉంటుంది. ఇది సినిమా చూసినప్పుడు చాలామంది గమనించలేదు. కానీ ఇటీవల మాత్రం ఈ పొరపాటును గమనించారు.

mistake in sarkaru vaari paata bank scene

అయితే ఈ పొరపాటు వల్ల సినిమాపై ఎటువంటి ప్రభావం పడలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ పై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఒక చోట హీరో రోడ్ మీద నుంచొని విలన్ కార్ ఆపి మాట్లాడుతూ సుబ్బరాజుకి వార్నింగ్ ఇస్తూ ఉన్న సీన్ లో చుట్టూ వైజాగ్ అని చూపిస్తున్నది గ్రాఫిక్స్ అని అర్ధమైపోతుంది. దాంతో ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది అని అన్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. అలాగే సినిమాలో మరొక సాంగ్ కూడా యాడ్ చేశారు. సినిమా చివరిలో ఈ పాట వస్తుంది.


You may also like