ఎమ్మెల్యే సోద‌రి కుటుంభం డెత్ కేసులో కొత్త ట్విస్ట్…ఆ నోట్ వల్ల వీడిన మిస్టరీ..!

ఎమ్మెల్యే సోద‌రి కుటుంభం డెత్ కేసులో కొత్త ట్విస్ట్…ఆ నోట్ వల్ల వీడిన మిస్టరీ..!

by Megha Varna

Ads

2020 జనవరి నెలలో తిమ్మాపూర్ మండలం ఆలూరు వద్ద పెద్దపల్లి ఎంఎల్ఏ మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కాలువ లో పడి మరణించారు.అయితే ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఈ మిస్టరీ ని కొన్ని ఆధారాలతో ఛేదించారు.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

మనోహర్ రెడ్డి సోదరి సత్యనారాయణ  రెడ్డి  అనే ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది.రామాపురానికి చెందిన సత్యనారాయణ చాలాకాలంగా ఫర్టిలైజర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు.చాలాకాలంగా వీరు లక్ష్మిపురంలోనే ఆనందంగానే జీవించారు.కానీ ఒక్కసారిగా కాలువలో కుళ్ళిన మృతదేహాలుగా సత్యనారాయణ మరియు వారి కుటుంబం కనపడడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

సత్యనారాయణ కుటుంబం ఒక్కసారిగా కనిపించకుండా పోయారు.అయితే సత్యనారాయణ కుటుంబానికి ఎప్పటినుండో తరచూ విహార యాత్రలకు వెళ్లే అలవాటు ఉంది.దీంతో విహారయాత్రలకు వెళ్లారేమో అని అనుకున్నారు స్థానికులంతా.కానీ కొన్ని రోజుల తర్వాత కాలువ లోని కార్ లో సత్యనారాయణ మరియు అతని భార్య రాధా,కూతురు వినయ శ్రీ కాలువలో శేవలుగా కనిపించరు.

దీంతో పోలీసులు విచారణ ఆరంభించిన తర్వాత ఫర్టిలైజర్ షాప్ లో సత్యనారాయణ రెడ్డి రాసిన ఆత్మహత్య లేఖ కనిపించింది.దీంతో సత్యనారాయణ రెడ్డి ఇతర పుస్తకాలలో రాసిన హ్యాండ్ రైటింగ్ ను కూడా పోలీసులు ఫోరెన్సిక్  ల్యాబ్ కు పంపారు.అయితే ఆత్మహత్య లేఖలో ఉన్న హ్యాండ్ రైటింగ్ మరియు ఇతర పుస్తకాలలో ఉన్న రైటింగ్ ఒకటే అని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది.దీంతో సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీపీ కమల్ హాసన్ రెడ్డి మీడియా తో చెప్పారు.


End of Article

You may also like