కోటి విద్యలు కూటి కొరకే, దేశాన్ని ఏలే ధనవంతులైన కూలిపని చేసుకునే కార్మికులు అయినా కష్టపడేది కడుపు నింపే గుప్పెడు మెతుకుల కోసమే. అలాంటి గుప్పెడు మెతుకులు కూడా తినలేని అన్నార్తులు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. అలాంటి వారి ఆకలి తీర్చాలని అన్నా మంచి ఉద్దేశంతో జిహెచ్ఎంసి చాలా తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సేవ ను ప్రారంభించి ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంలో హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జిహెచ్ఎంసి వారు మొబైల్ అన్నపూర్ణ అనే పథకాన్ని ప్రారంభించారు.

Video Advertisement

ఈ పథకం ప్రకారం వృద్ధులు, పిల్లలు, వికలాంగులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించి కేవలం ఐదు రూపాయలకే భోజనంని వారి ఇంటివద్దకు తీసుకుని వెళ్ళి వారికి అందించాలి అన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా 24 రూపాయలు ఖర్చు అయ్యే భోజనాన్ని కేవలం 5 రూపాయలకే అందిస్తున్నారు. భోజనం పాడైపోకుండా ప్రత్యేకంగా తయారు చేసిన లంచ్ బాక్సుల్లో ఈ భోజనాన్ని వారి ఇంటికి ఆటోల ద్వారా సప్లై చేసి తిరిగి అదే బండిలో ఈ బాక్సస్ ని తీసుకొని వెళ్తారు.