ఎట్టకేలకు తండ్రి చివరి కోరిక తీర్చిన అమృత…!

ఎట్టకేలకు తండ్రి చివరి కోరిక తీర్చిన అమృత…!

by Megha Varna

కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని  హత్య చేయించిన సంగతి అందరికి తెలిసిందే.ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు ఏ 1 గా, అతని తమ్ముడు శ్రవణ్‌ ఏ 2 గా ఉన్నారు. ఏ 1 నిందితుడిగా ఉన్న మారుతీరావు హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఈ నెల మార్చి 8 న ఆత్మహత్య చేసుకున్నాడు.

విషం కారణంగానే ఆయన మృతి చెందినట్టు పోస్టుమార్టం లో తేల్చారు. కారులో కానీ, ఆయన గదిలో కానీ విషం బాటిల్ దొరకలేదు. ఈ విషం బోటిల్ కోసం క్లూస్ టీం వెతుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:22 గంటలకు మారుతీరావు చివరి సారిగా తన లాయర్ తో ఫోన్ మాట్లాడారు మారుతీ రావు. ఆదివారం ఉదయం ఆయనకు కలవాల్సి ఉంది. కానీ ఇంతలో మారుతీ రావు ఇలా చేసేసరికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మారుతీరావు ఆత్మహత్య  కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఎట్టకేలకు తండ్రి చివరి కోరిక తీర్చిన అమృత

ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ దొరికింది. అందులో మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. గిరిజా క్షమించు… అమృత తల్లి దగ్గరకు వెళ్లిపో” అని సూసైడ్ నోట్ రాశారు.

మరుసటి రోజు జరిగిన అంత్యక్రియలకు అమృత వెళ్లగా మారుతీరావు బంధువులు గో బ్యాక్ అంటూ  నినాదాలు చేశారు,దీంతో అక్కడి నుంచి వెనుదిరింది. తండ్రి చివరి కోరిక మేరకు అమృత ఒక నిర్ణయం తీసుకుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడింది.మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది..తల్లి బాధలో ఉందని ఓదార్చేంది.ఇద్దరు కలిసి అరగంట సేపు మాట్లాడుకున్నారు.మారుతీరావు ఆత్మహత్య తర్వాత తల్లిని అమృత కలవడం ఇదే తొలిసారి.అయితే ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి తాను తల్లి దగ్గరకు వెళ్లలేనని ,ఒకవేళ తన తల్లి తన దగ్గరికి వచ్చి ఉంటే మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది అమృత చెప్పేసింది.

You may also like