సోషల్ మీడియాలో స్నేహితులను, సెలబ్రెటీలను ఫాలో అవడంతో పాటు వ్యక్తిగత అభిప్రాయాలకు తగిన వారిని ఫాలో అవడం సహజమే. అయితే సెలబ్రిటీలు కూడా ఈ మధ్య వారికి నచ్చిన కంటెంట్ ను చూడడానికి సామాన్యులను కూడా ఫాలో అవుతున్నారు.

Video Advertisement

ఇదే ఒక అమ్మాయికి ఎదురైంది. ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ కశ్యప్. అయితే ఈమె ట్విట్టర్ ఎకౌంట్లో ఒక పెద్ద సెలబ్రిటీ ఫాలో అవుతున్నారు. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇంతకీ నరేంద్ర మోడీ ఎందుకు ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో ఇప్పుడే తెలుసుకుందాం.

ప్రజ్ఞా కశ్యప్ కు 22 ఏళ్లు. ఈమె ఒక లా విద్యార్థిని, చిన్న వయసు నుండే సమాజ సేవ అంటే ఎంతో ఇష్టం. అందువలన చాలా సేవా కార్యక్రమాలను నిర్వహించడం మరియు పాల్గొనడం చేస్తుంది. నిజంగా సేవ చెయ్యడం అంత ఈజీ కాదు. ఎంతో శ్రమించాలి. అయితే ఈమె ఇంతలా సేవ చేయడం వెనుక వుండే కారణం ఏమిటంటే…? ఈమె చేసే సేవ అంతా కూడా తన కుటుంబం నుండి నేర్చుకుంది.

నిజానికి తండ్రి, తాతయ్య కూడా వారి జీవితాలలో సమాజ సేవలు ఎక్కువగా చేశారని దాని వల్లనే సేవాభావంతో కలిగి ఉందని ఆమె చెప్పింది. ఆ స్పూర్తి వల్లే ఈ ఆరోజు అందరికీ సహాయం చేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నానని అంటోంది.

సామాజిక కార్యక్రమాలతో పాటుగా చదువు, డాన్స్, వీణ, డ్రాయింగ్ మరియు ధ్యానం వంటి ఇతర టాలెంట్లతో తన సమయాన్ని గడుపుతూ ఉందని ఆమె చెప్పింది. అంతే కాదు మోడీ ఈమెను ఫాలో అవుతుండడంతో గర్వంగా మరియు ఆనందంగా ఫీల్ అయ్యింది. పైగా ప్రధానమంత్రి ఈమెకు స్ఫూర్తి కావడంతో చాలా గౌరవం దక్కిందని భావిస్తోంది.