Ads
విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నటించిన డిఫరెంట్ పాత్రలే ఆయన ఎంత మంచి నటుడు అనేది చెప్తాయి. ఆయన నటనకు గాను ఇన్ని సంవత్సరాల తన సినీ కెరీర్లో ఎన్నో అవార్డులను, ఎంతో గుర్తింపును సాధించారు.
Video Advertisement

కామెడీ పాత్ర, విలన్ పాత్ర, సీరియస్ పాత్ర ఇలా ఎన్నో రకాల పాత్రలను పోషించారు మోహన్ బాబు గారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన మోహన్ బాబు గారు. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నారు.

అయితే, మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడుగా నిలదొక్కుకునే ముందు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకసారి మోహన్ బాబు గారు తాను ఉండే ఇంటికి అద్దె కట్టలేదు. దాంతో ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. కోపగించుకున్న ఆ యజమాని వెళ్లి మోహన్ బాబు గారు తినే కంచంలో మలవిసర్జన చేశారట.
ఈ విషయాన్ని ఇటీవల డ్రామా జూనియర్స్ లో అలీ చెప్పారు. ఈ ఎపిసోడ్ కి మంచు లక్ష్మి అతిథిగా వచ్చారు. ఇందులో ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్తూ కొంత మంది పార్టిసిపెంట్స్ ఒక స్కిట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ అలీ ఆ సంఘటనని చెప్పారు.
watch video :
https://youtu.be/FsHvUjHLCPo
End of Article
