Ads
బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్ పేరుని బీజేపీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వి.డి. శర్మ ప్రకటించారు.
Video Advertisement
మోహన్ యాదవ్ పేరుని ప్రముఖ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా మోహన్ యాదవ్ పనిచేశారు. అసలు ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన నాయకులలో మొదట మోహన్ యాదవ్ పేరు లేకపోవడం గమనార్హం. కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో మొదటి నుండి మోహన్ యాదవ్ కి సత్సంబంధాలు ఉన్నాయి. అంతేv కాకుండా రాష్ట్రంలో 48 శాతం మంది జనాభా ఉన్న ఓబీసీ నేత కూడా మోహన్ యాదవ్ అయ్యారు.
మోహన్ యాదవ్ 1965 మార్చి 25 వ తేదీన ఉజ్జయినిలో జన్మించారు. ఎల్.ఎల్.బి, ఎంబీఏ పాటు మోహన్ యాదవ్ పి హెచ్ డి పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి కూడా మోహన్ యాదవ్ కి ఆర్.ఎస్.ఎస్ తో మంచి సంబంధం ఉంది. 1993 నుండి 1995 వరకు అక్కడే ఆఫీస్ బేరర్ గా మోహన్ యాదవ్ పనిచేశారు. మోహన్ యాదవ్ విద్యార్థి నుండి నాయకుడిగా ఎదిగారు. మోహన్ యాదవ్ కళాశాలలో రామ చరిత మానస్ ని ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2001 లో ప్రకటించారు. అయితే మోహన్ యాదవ్ మీద కరడు కట్టిన హిందుత్వవాది అనే ముద్ర కూడా ఉంది. మోహన్ యాదవ్ మొదటిసారి 2013 లో ఉజ్జయిని సౌత్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు.
ఆ తర్వాత 2018, ఆ తర్వాత 2023 లో కూడా అక్కడి నుండి విజయం సాధించారు. 2020 లో మొదటిసారిగా మోహన్ యాదవ్ మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొదటి నాయకుడిగా మోహన్ యాదవ్ ఘనత సాధించారు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పుడు ఈ పదవి నుండి తప్పుకోబోతున్నారు. ముందుగా ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ కొనసాగుతారు అని అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ ముఖ్యమంత్రి మార్పుకి ఆసక్తి చూపింది. ఈ కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
ALSO READ : YASHASWINI REDDY: అత్త శపథం నెరవేర్చిన కోడలు…ఇంతకీ ఎవరు ఆ కోడలు.? ఏంటి ఆ శపథం…?
End of Article