1.5K
				
				
                
					                
				            
        Ads
మనం జన్మించినప్పుడు ఉండే నల్లటి మచ్చలను పుట్టుమచ్చలు అంటారు.శరీరమందు పుట్టు మచ్చలు కొన్ని చోట్ల చిన్నవిగాను, ఎక్కువగాను, ఉన్నయెడల అందు పెద్ద మచ్చలనే గమనించి ఫలితములు చూసుకొనవలెను. కొన్ని పుట్టు మచ్చలవలన మనుషుల యొక్క స్వభావసిద్దమైన గుణభావములను తెలిసికొన వచ్చును. అలాంటిది పరిశీలనాశక్తి విూద ఆధారపడి ఉండును.పుట్టు మచ్చల వల్ల మీ జాతకాన్ని చెప్పచు అనేది మీరు నమ్ముతారా…? అయితే ఇది చదవండి.
Video Advertisement

ముఖం పై పుట్టుమచ్చల ఫలితాలు
1. ముఖం పై పుట్టుమచ్చల ఫలితాలు
- ఎడమకన్ను పై పుట్టుమచ్చ ఉంటే– స్వార్జిత ధనార్జన
 - కుడికన్ను పై పుట్టుమచ్చ ఉంటే– అనుకూల దాంపత్యము
 - ముక్కుమీద పై పుట్టుమచ్చ ఉంటే– కోపము, వ్యాపార దక్షత
 - గడ్డము పై పుట్టుమచ్చ ఉంటే– విశేష ధన యోగము
 - నుదిటి మీద పుట్టుమచ్చ ఉంటే– మేధావి, ధన వంతులు
 - దవడల యందు( స్త్రీ లకు ) పుట్టుమచ్చ ఉంటే_ దుఖ: వంతులు
 - ముక్కు ప్రక్కల యందు పుట్టుమచ్చ ఉంటే– దేశ సంచారి
 - గడ్డమందు పుట్టుమచ్చ ఉంటే– ధనము ,కీర్తి
 - పెదవులందు పుట్టుమచ్చ ఉంటే – చమత్కారులు
 - ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే– కార్య సిద్ది
 - చెక్కిలి యందు పుట్టుమచ్చ ఉంటే – సకల భోగాలు
 - ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే– దురదుష్టం
 - కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే– ధన వంతులతో వివాహం
 - ఎడమ కణత పై పుట్టుమచ్చ ఉంటే– అపజయాలు, దుర దృష్టం
 - కుడి కణత పై పుట్టుమచ్చ ఉంటే – ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
 

మొండెము భాగం లో గల పుట్టుమచ్చలకు ఫలితాలు
2. మొండెము భాగం లో గల పుట్టుమచ్చలకు ఫలితాలు
- గళము నందు పుట్టుమచ్చ ఉంటే– వివాహం వలన ధన ప్రాప్తి
 - కంఠము మీద పుట్టుమచ్చ ఉంటే– ఆకస్మిక ధన లాభం
 - మెడ మీద పుట్టుమచ్చ ఉంటే– భార్యద్వారా ధనయోగం
 - చంకల నుండి కటి ప్రదేశము వరకు (కుడి ఎడమ ప్రక్కలు ) – ఆరోగ్య భంగం, ధన వ్యయం
 - కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే– వివేకులు, వినయము కలవారు
 - కుడి భుజం పై పుట్టుమచ్చ ఉంటే– త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
 - ఎడమ భుజం పై పుట్టుమచ్చ ఉంటే – మూర్ఖత్వానికి గుర్తు
 - కుడి బాహువు పై పుట్టుమచ్చ ఉంటే– బల ధైర్యవంతులు
 - ఎడమ బాహువుపై పుట్టుమచ్చ ఉంటే – కార్య సిద్ది
 - మోచేయి దగ్గర పుట్టుమచ్చ ఉంటే– చంచలత్వం
 - మోచేయి క్రింద పుట్టుమచ్చ ఉంటే– జీవితాన్తమున ధన లాభము
 - మోచేయి పై పుట్టుమచ్చ ఉంటే– వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
 - కుడిచేయి మణికట్టునందు – విశేష బంగారు ఆభరణములు ధరించుట
 - చేతి బ్రొటన వ్రేలు పై పుట్టుమచ్చ ఉంటే– స్వతంత్ర విద్య, వ్యాపారం
 - కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి
 - పొట్టమీద పుట్టుమచ్చ ఉంటే– భోజనప్రియులు
 - పొట్టక్రింద పుట్టుమచ్చ ఉంటే– అనారోగ్యం
 - ఉదరము పై పుట్టుమచ్చ ఉంటే– తిండి పోతూ, దురాశ కలవారు
 - పొత్తి కడుపు పై పుట్టుమచ్చ ఉంటే– బల హీనతలు కలవారు
 - బొడ్డులోపల పుట్టుమచ్చ ఉంటే– ధనలాభములు
 

నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు గల పుట్టుమచ్చల ఫలితాలు
3. నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు గల పుట్టుమచ్చల ఫలితాలు
- కుడి తొడ పై పుట్టుమచ్చ ఉంటే– అదృష్టము
 - ఎడమ తొడ పై పుట్టుమచ్చ ఉంటే – దారిద్యము
 - కుడి మోకాలు పై పుట్టుమచ్చ ఉంటే – భార్య వలన గృహ సౌక్యము
 - ఎడమ మోకాలు(పురుషులకు ) పై పుట్టుమచ్చ ఉంటే– అల్ప బుద్ధి
 - ఎడమ మోకాలు( స్త్రీలకూ ) పై పుట్టుమచ్చ ఉంటే– అధిక సంతానం
 - కుడితొడ పై పుట్టుమచ్చ ఉంటే– ధనవంతులు
 - ఎడమతొడ పై పుట్టుమచ్చ ఉంటే– సంభోగం
 - పిక్కల యందు పై పుట్టుమచ్చ ఉంటే– అలసత్వం
 - పాదాల యందు పుట్టుమచ్చ ఉంటే– ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
 - పాదముల మీద పుట్టుమచ్చ ఉంటే – ప్రయాణములు
 - మర్మస్థానం పై పుట్టుమచ్చ ఉంటే– కష్ట సుఖములు సమానం.
 
End of Article
