Ads
బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన మోనాల్ గజ్జర్ ఇటీవల సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో మాట్లాడిన మోనాల్, “ఇష్టం లేకపోతే ఫాలో అవ్వకండి. కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టకండి” అని ఎమోషనల్ అయ్యారు.
Video Advertisement
“నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవి అన్ని నేను పడను. ఇది నా లైవ్. ఇంస్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ నా కుటుంబం. ఒకవేళ నా కుటుంబంలో ఎవరైనా నన్ను ఇష్టపడకపోతే మీరు దూరంగా వెళ్ళిపోవచ్చు. అంతేకానీ న్యూసెన్స్ క్రియేట్ చేయకండి” అని అన్నారు.
“నేను మీరు అనే మాటలు అన్నీ పడను. బిగ్ బాస్ లో ఏమైందో ఎవరికీ ఐడియా లేదు. ఇది నా జీవితం. మీరు కేవలం ఒక గంట షో చూసి మాత్రమే మాట్లాడుతున్నారు. మేము అందులో 24గంటలు ఉన్నాం. దాని గురించి మీకు ఏమీ తెలియదు. నేను ఎవరినైనా క్షమించగలను. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మీ గురించి ఆలోచించుకోండి. మీకు మీరు సహాయం చేసుకోలేకపోతే నేను ఏం చేయలేను. నా కుటుంబం అందర్నీ క్షమించడం, అలాగే నా జీవితాన్ని నేను బతకడం నేర్పించింది. న్యూసెన్స్ క్రియేట్ చేయమని చెప్పలేదు. నేను ఎవరి మీద పగ పెంచుకోను. అందరినీ తొందరగా క్షమిస్తాను” అని ఎమోషనల్ అయ్యారు మోనాల్.
watch video :
End of Article