Ads
కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 ఆరు సంవత్సరాలు పాటు ప్రజలను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కార్తీకదీపం సీజన్ 2 కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఈ సీరియల్ మార్చి 25 నుంచి స్టార్ మా చానల్లో టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మా చానల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 8 గంటలకు కార్తీకదీపం 2 నవ వసంతం సీరియల్ టెలికాస్ట్ ఉంటుందని స్టార్ మా తెలిపింది.
Video Advertisement
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. అయితే ఈ సీరియల్ కి మూల స్తంభాలైన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు మూల స్తంభాలు. అయితే ఈ మూడు పాత్రలూ కూడా సీజన్ 2 లో కంటిన్యూ అవుతాయా అంటే డాక్టర్ బాబు వంటలక్క క్యారెక్టర్లు ఈ సీరియల్ లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ లేడీ విలన్ మోనిత ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె గురించి ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు ప్రసారం కాబోతున్న కార్తీకదీపం 2 సీరియల్ కార్తీకదీపం సీరియల్ వంటి సీక్వెల్ కాదని, ఆ కథకి ఈ కథకి అసలు సంబంధం ఉండదు. తమిళంలో సూపర్ హిట్ సీరియల్ అయిన చెల్లమ్మ సీరియల్ ని మార్పులు చేర్పులతో కార్తీక దీపం 2 గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.
chellamma tamil serial- hotstar
అయితే ఈ సీరియల్ లో మోనిత లాంటి లేడీ విలన్ ఉంటుంది కానీ ఆ పాత్రని శోభా శెట్టి పోషించడం లేదు.అయితే ఆ పాత్రలో పోషిస్తున్న కొత్త పాత్ర ఇంచుమించు మోనిత ని పోలినట్లే ఉంది. చూడటానికి అచ్చం శోభ శెట్టి చెల్లి లాగే ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా గతంలో శోభా శెట్టి వేసుకున్నది కావటంతో శోభా శెట్టి చెల్లెలు అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ కొత్త మోనితతో దీపక్క ఎన్ని పాట్లు పడుతుందో వేచి చూడాల్సిందే!
End of Article