కర్నూల్ లో 20 కి పైగా కోతులు మరణం…మరి కొన్ని చావు బతుకుల్లో.! కారణం ఏంటి?

కర్నూల్ లో 20 కి పైగా కోతులు మరణం…మరి కొన్ని చావు బతుకుల్లో.! కారణం ఏంటి?

by Megha Varna

Ads

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అవుతున్న వారిలో కర్నూల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది .గుంటూరు జిల్లాలో కూడా కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కర్నూలు తో పోలిస్తే మాత్రం తక్కువనే చెప్పాలి .ఒక్క కర్నూలు జిల్లాలోనే 158 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి .ప్రతి గంటకు ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా పెద్ద సంఖ్యలో కోతులు చనిపోతుండటం కలవరం రేపుతోంది ..

Video Advertisement

కర్నూలు జిల్లా నందికొట్కూర్ దగ్గరలోని గడివేములలో దాదాపు 20 కి పైగా కోతులు చనిపోయాయి.మరి కొన్నింటి పరిస్థితి విషమంగా ఉంది .చాలా కోతులు లేవలేని స్థితిలో ఉన్నాయి.కోతులు కరోనా వైరస్ వల్లనే చనిపోతున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి .ఈ సమాచారం జిల్లా అధికారులకు ,నందికొట్కూరు పాసు వైద్యాధికారులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగారు .

కోతుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసారు..కాగా కోతులు కరోనా వైరస్ వలన చనిపోలేదని ,ఆకలిని తట్టుకోలేక చనిపోయినట్లు నిర్ధారించారు .కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ వలన వాటికీ ఆహారం దొరకడం కష్టం అయింది అని అన్నారు .లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకి రాకపోవడం ,దుకాణాలు తెరవకపోవడం వంటి కారణాల వల్ల కోతులకి ఆహారం దొరకడం కష్టం అయింది అని వెల్లడించారు .ప్రజలు మనస్తత్త్వంతో వాటికీ ఆహారం అందించాలని కోరారు ..

కోతులు చనిపోవడానికి కారణం కరోనా వైరస్ కాదు అని ,అవి చనిపోవడానికి కారణం ఆహారం లేకపోవడం అని తెలుసుకున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు .కానీ కోతులు ఆహారం లేక చనిపోవడంతో విచారం వ్యక్తం చేసారు .ఇప్పటికే గతంలో కర్నూలు  జిల్లాలోనే పెద్ద సంఖ్యలో కాకులు చనిపోయిన సంఘటన చేటు చేసుకుంది ..తాజాగా కోతులు చనిపోవడం పై స్థానికులు స్పందిస్తూ వాతావరణం బాగా వేడిగా ఉండడం పైగా వాటికీ నీరు ,ఆహారం దొరకడం కష్టం అవుతుందని దీనిపై ప్రభుత్త్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ..


End of Article

You may also like