Ads
చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
Video Advertisement
నటీనటులు : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, సుడిగాలి సుధీర్, జయ ప్రకాష్, పోసాని కృష్ణ మురళి.
నిర్మాత : వాసు వర్మ, బన్నీ వాసు
దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
సంగీతం : గోపి సుందర్
విడుదల తేదీ : అక్టోబర్ 15, 2021
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ :
హర్ష (అఖిల్ అక్కినేని) ఒక ఎన్ఆర్ఐ. 20 రోజుల్లో పెళ్లి చేసుకుందామని అమ్మాయి వెతకడం కోసం హైదరాబాద్ కి వస్తాడు. హర్ష చాలా మంది అమ్మాయిలను కలుస్తాడు. కానీ వాళ్లెవరు హర్షకి నచ్చరు. అయితే హర్షకి, విభ (పూజా హెగ్డే) అనే ఒక అమ్మాయి నచ్చుతుంది. కానీ తనని హర్ష కుటుంబం రిజెక్ట్ చేస్తుంది. తర్వాత విభకి కూడా పెళ్లంటే ఇష్టం లేదని తెలుస్తుంది. ఎందుకు విభకి పెళ్లి అంటే ఇష్టం లేదు? హర్ష విభని పెళ్లి కోసం కన్విన్స్ చేశాడా? మధ్యలో వాళ్ళిద్దరికీ ఎదురైన సమస్యలు ఏంటి? చివరికి విభ హర్షని ఇష్ట పడుతుందా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అఖిల్ అక్కినేని మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అఖిల్ కి ఈ రోల్ బాగా సూట్ అయింది. తన ముందు సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో కూడా మెరుగయ్యారు. పూజా హెగ్డే ఇప్పటివరకు తన కెరియర్ లో పోషించని పాత్ర ఈ సినిమాలో చేశారు. ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే నటన విషయంలో కూడా జాగ్రత్త వహించారు అని తెలుస్తుంది.
ఇంక మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన ఆమని, జయ ప్రకాష్, సుడిగాలి సుధీర్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వీళ్లు కూడా తమ పాత్రల్లో బానే నటించారు. గోపి సుందర్ పాటలు సినిమాకి ఒక హైలైట్ గా నిలిచాయి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగుతుంది. కాని సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా డల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని చోట్ల మంచి సీన్స్ ఉన్నా కూడా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. దాంతో కొన్నిచోట్ల బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో కథ మనం అంతకు ముందు చూసే ఉంటాం, కానీ దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన విధానం కొత్తగా ఉండటంతో సినిమా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్ట్రీ
పాటలు
ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసిన కథ
సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనిపించే సీన్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
అక్కడక్కడ కొంచెం డల్ గా ఉన్నా కూడా చాలావరకు సినిమా సరదాగా సాగిపోతుంది. ఈ పండగకి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఒక సారి అయితే కచ్చితంగా చూడొచ్చు.
End of Article