Ads
రకరకాల పేర్లు, రకరకాల రంగులు, రక రకాల వాసనలు కానీ చివరికి చేసే పని ఒకటే. శుభ్రం చేయడం. అవే సబ్బులు. సబ్బులు తయారు చేసే సంస్థలు కూడా ప్రతి సబ్బు కి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. మా సబ్బు వాడితే మొటిమలు పోతాయి, మా కంపెనీ సబ్బు వాడితే రంగు మారిపోతారు, మా కంపెనీ సబ్బు వాడితే చెమట వాసన రాదు ఇలా ఎన్నో చెప్తారు.
Video Advertisement
వాళ్లు చెప్పేది నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే వాళ్లు చెప్పిన విషయాల వల్ల సబ్బుల సేల్స్ మాత్రం పెరుగుతాయి. కరోనా కారణంగా సబ్బులు అమ్ముడయ్యే స్థానాలు కూడా మారాయి.
ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడే సబ్బులనే ఎక్కువ గా కొంటున్నారు. ఆరోగ్యం అంటే అందరికీ గుర్తొచ్చే సబ్బు లైఫ్ బాయ్. ఎందుకంటే లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది కాబట్టి.
కానీ విచిత్రం ఏంటి అంటే టాప్ వన్ స్థానంలో ఉన్నది అంటే అన్నిటికంటే ఎక్కువ అమ్ముడుపోయిన సబ్బు లైఫ్ బాయ్ కాదు. ప్రస్తుతం టాప్ స్థానంలో చోటు దక్కించుకున్న సబ్బు డెటాల్. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్ బాయ్ సబ్బులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అన్ని చోట్ల డెటాల్ అమ్మకాలు మొదటి స్థానంలో ఉన్నాయి.
2020 సంవత్సరం లో మొదటి ఆరు నెలల్లో డెటాల్ అమ్మకాలు పెరిగాయట. అంతర్జాతీయంగా కూడా డెటాల్ విక్రయాలు 62% ఉన్నాయట. దేశీయ మార్కెట్లో డెటాల్ వాటా దాదాపు 430 బేసిస్ పాయింట్లు పెరిగిందట.
2019లో లైఫ్ బాయ్ మార్కెట్ 13.1 శాతం, గోద్రెజ్ నంబర్ వన్ మార్కెట్ 12.3 శాతం, డెటాల్ మార్కెట్ 10.4 శాతం ఉండేదట. ఈ సంవత్సరం మాత్రం డెటాల్ అన్ని సబ్బులను దాటి నెంబర్ వన్ స్థానంలో చోటు దక్కించుకుంది.
End of Article