ఎయిర్ పోర్ట్ లో తల్లికి వెల్కమ్ చెప్పడానికి వెళ్లి చెప్పుదెబ్బలు..వీడియో వైరల్..!

ఎయిర్ పోర్ట్ లో తల్లికి వెల్కమ్ చెప్పడానికి వెళ్లి చెప్పుదెబ్బలు..వీడియో వైరల్..!

by Megha Varna

Ads

ఎప్పుడైనా ఇతర దేశాల నుండి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి వెల్కమ్ చెప్తూ ఉంటాము. అలానే ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాము. అలాంటిది సొంత ఇంట్లో వాళ్లే దేశం కాని దేశం వెళ్లి చాలా ఏళ్ళ తర్వాత ఇంటికి వస్తున్నారు అంటే మనకి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్ పోర్ట్ కి కూడా వెళుతూ ఉంటాం.

Video Advertisement

ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినప్పుడు పూల దండలు, గిఫ్ట్లు లేదా బొకేలు వంటివి తీసుకొని వెళ్తాము. అదే అమ్మ వచ్చిందంటే గట్టిగా ఒకసారి పట్టుకుని ఏదైనా నచ్చిన బహుమతి ఇస్తూ ఉంటాం. కొంతమంది సంతోషంతో కన్నీరు కూడా పెట్టుకుంటారు. అయితే తాజాగా ఒక కొడుకు తన తల్లిని ఎయిర్ పోర్ట్ నుండి తీసుకు రావడానికి వెళ్ళాడు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ కి చెందిన అన్వర్ జలాని తన తల్లికి వెల్కమ్ చెప్పడానికి వెళ్ళాడు. ఎయిర్ పోర్ట్ కి ఒక చేతిలో బోర్డు పట్టుకుని మరొక చేతితో బొకేని పట్టుకుని వెళ్లాడు. తల్లి వచ్చింది. మిస్ యు అమ్మా అంటూ ప్లకార్డులు పట్టుకుని మరీ ఎదురొచ్చాడు స్వాగతం పలకడానికి.  కానీ కొడుకుని తల్లి కాలి నుంచి చెప్పు తీసుకుని కొట్టింది. తర్వాత ప్రేమతో హగ్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి నెటిజన్లు వెరైటీగా అమ్మ నీకు థాంక్స్ చెప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

https://www.instagram.com/reel/CWjloLRA9zs/?utm_source=ig_embed&ig_rid=fb709c61-fd0d-4726-aa14-e6d70244e7b8


End of Article

You may also like