ఒక తల్లే తన బిడ్డ ప్రాణాలని తీయమని ఎందుకు అడిగింది..? దానికి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది..?

ఒక తల్లే తన బిడ్డ ప్రాణాలని తీయమని ఎందుకు అడిగింది..? దానికి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది..?

by kavitha

Ads

ఒక మహిళ కొన్ని రోజల కిత్రం తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం పై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది.

Video Advertisement

ఈ క్రమంలో నేడు(సోమవారం) ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించింది. ఆ మహిళ ఎందుకు 26 వారాల గర్భాన్ని తొలగించుకోవాలనుకుంది? సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల 26 వారాల గర్భవిచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ 27 సంవత్సరాల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను మానసికంగా, శారీరకంగా మరో బిడ్డను కనడానికి సిద్ధంగా లేనని కోర్టుకు వివరించింది. మహిళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అ-బా-ర్ష-న్‌కి పర్మిషన్ ఇచ్చారు. వైద్య పరంగా అ-బా-ర్ష-న్‌ కు అక్టోబరు 9న అనుమతిని ఇచ్చింది.
కానీ, ఆ తరువాతి రోజు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 26 వారాల సమయంలో అబార్షన్ చేసినట్లయితే ప్రాణాలకే ముప్పు అని నివేదిక ఇచ్చారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం, చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ కు పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. తల్లి గర్భంలోని శిశువు గుండెను ఆపడానికి కోర్టు సుముఖంగా లేదని అన్నారు. ఇప్పటికే గర్భిణికి 26 వారాల, 5 రోజులు అని, ప్రస్తుతం ఈ గర్భం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
తల్లి హక్కు మరియు గర్భస్థ శిశువు హక్కు మధ్య సమతౌల్యం పాటించాలని అన్నారు. అ-బా-ర్ష-న్ కి పర్మిషన్ ఇస్తే ‘మెడికల్‌ టె-ర్మి-నే-ష-న్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ’ చట్టంలోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 5 లను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఈ మహిళ ఎయిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును గవర్నమెంట్ భరిస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తాను పెంచుకోవాలా లేదా ఎవరికైనా దత్తత ఇవ్వాలా అనే  విషయం పై తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.

Also Read: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!


End of Article

You may also like