తల్లి ముందు కన్నీరుమున్నీరైన 9ఏళ్ల బాలుడు! వీడియో చూస్తే మీకు కన్నీళ్లొస్తాయి

తల్లి ముందు కన్నీరుమున్నీరైన 9ఏళ్ల బాలుడు! వీడియో చూస్తే మీకు కన్నీళ్లొస్తాయి

by Megha Varna

ఒంటి రంగును, రూపును చూసి మనుషులను కొందరు ఎగతాళి చేస్తుంటారు. సాటివారి మనసును నొప్పిస్తూ అనందాన్ని పొందుతుంటారు. ఇటువంటి ఘటనే ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో చోటుచేసుకుంది.మరుగుజ్జుతనమే ఓ చిన్నారి వేదనకు కారణమైంది. తట్టుకోలేని ఆ వేదన ఆత్మహత్య చేసుకోవాలనేంతగా ఆలోచనకు దారితీసింది. ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు చనిపోవాలని ఉందని కన్న తల్లి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. తనకు తాడు ఇవ్వండి..ఉరి వేసుకుంటా.. అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేస్‌కు చెందిన క్వాడెన్ (9), అచాడ్రోపాల్సియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తన పరిస్థితిని చూసుకుని లోలోపల కుమిలిపోతూనే చదువుకోవడానికి స్కూల్‌ వెళ్తున్న క్వాడెన్‌ను తోటి విద్యార్థులు హేళన చేసేవారు. అయినా వారి మాటలకు క్వాడెన్ కుంగిపోలేదు.

Video Advertisement

ఈ నేపథ్యంలో బుధవారం రోజు తోటి విద్యార్థులు అతడ్ని తీవ్రంగా అవమానించారు. వారి మాటలు భరించలేకపోయిన క్వాడెన్.. ‘నాకు ఓ తాడివ్వండి, ఉరేసుకుని చనిపోతాను. లేదా  ఎవరైనా నన్ను చంపేయండి’ అంటూ కన్నతల్లి యర్రాక ముందే బోరున విలపించాడు. కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన యర్రాక.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. క్వాడెన్‌కు ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు. నేను ఇలాంటి విషయాలను ప్రిన్సిపల్‌కు చెప్పె దాన్ని. కానీ, ఓ పిల్లాడి బాధపడుతున్న విషయాన్ని అందరికి తెలియాలని వీడియో చిత్రీకరించా అని యర్రాక బైల్స్‌ తెలిపింది.


You may also like

Leave a Comment