Home News మౌనరాగం,మనసుమమాత ఫేమ్ “శ్రావణి” ఆత్మహత్య…టిక్ టాక్ పరిచయం, వేధింపులే కారణం!

మౌనరాగం,మనసుమమాత ఫేమ్ “శ్రావణి” ఆత్మహత్య…టిక్ టాక్ పరిచయం, వేధింపులే కారణం!

by Megha Varna

తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మౌన రాగం, మనసుమమత సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివాసముంటున్నారామె.

రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంట‌నే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు.

మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. .. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయమయ్యారు. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను.

ఆ పరిచయం స్నేహంగా మారింది. అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు.దేవరాజు రెడ్డి వేధింపులు తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది అంటూ శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 

You may also like